భారత్‌లో పెరుగుతోన్న స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు

Posted By:

దేశీయంగా మొబైల్ ఫోన్‌ల వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విస్తరిస్తోంది. గతేడాది మొత్తం మీద 247.2 మిలియన్ సెల్‌ఫోన్ యూనిట్లు అమ్ముడవగా. వాటిలో 44 మిలియన్ యూనిట్లు స్మార్ట్‌ఫోన్లు ఉన్నట్లు ‌ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) బుధవారం వెల్లడించింది. 2012లో మొత్తం 22 కోట్ల సెల్‌ఫోన్లు విక్రయం కాగా వాటిలో స్మార్ట్‌ఫోన్‌ల సంఖ్య 1.62కోట్లు. ఈ గణంకాలను విశ్లేషించినట్లయితే భారతీయుల్లో స్మార్ట్‌ఫోన్‌ల పట్ల అభిరుచి ఏ మేరకు పెరుగుతుందనే వాస్తవం అర్థమవుతోంది.

భారత్‌లో పెరుగుతోన్న స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవటంతో అత్యధిక శాతం మంది యూజర్లు ఫీచర్ ఫోన్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లకు మళ్లుతున్నారని ఐడీసీ విశ్లేషిస్తోంది. దేశవాళీ కంపెనీలు ఒక వైపు, అంతర్జాతీయ బ్రాండ్లు మరోవైపు బడ్జెట్ ఫ్రెండ్లీ ధర శ్రేణుల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తుండటంతో విక్రయాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది.

ఇండియర్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలను పరిశీలించినట్లయితే.. 38 శాతంతో సామ్‌సంగ్ మొదటి స్థానంలో నిలిచింది. 16 శాతంతో మైక్రోమాక్స్ రెండవ స్థానంలో నిలవగా, కార్బన్ (10శాతం), సోనీ (5శాతం), లావా (4.7శాతం) నమోదుతో తరువాతి స్థానాల్లో నిలిచాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot