ఆండ్రాయిడ్ గోతో మైక్రోమ్యాక్స్ మొబైల్‌‌, కేవలం రూ. 2 వేలకే..

Written By:

దేశీయమొబైల్స్ తయారీ దిగ్గజం మైక్రోమ్యాక్స్ త్వరలో ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ కలిగిన కొత్త బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతోంది. ఇండియాలో మొట్టమొదటిసారిగా లాంచ్ చేయబొయే కంపెని కూడా ఇదేనని రిపోర్టులు తెలియజేస్తున్నాయి. కాగా దీని ధర రూ. 2 వేలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో 512 ఎంబీ, 1జీబీ ర్యామ్ కలిగిన వేరియెంట్లను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

సోనీ నుంచి సరికొత్త మొబైల్, 6 అంగుళాల డిస్‌ప్లేతో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ రీసెంట్‌గా విడుదల చేసిన..

ఈ ఫోన్‌లో గూగుల్ రీసెంట్‌గా విడుదల చేసిన గూగుల్ గో, మ్యాప్స్ గో, జీమెయిల్ గో, యూట్యూబ్ గో, అసిస్టెంట్ గో, ఫైల్స్ గో తదితర లైట్ వెయిట్ యాప్స్‌ను ప్రీ ఇన్‌స్టాల్డ్‌గా అందివ్వనున్నారు.

4 ఇంచ్ డిస్‌ప్లే..

4 ఇంచ్ డిస్‌ప్లే, 8 జీబీ స్టోరేజ్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, డ్యుయల్ సిమ్, 4జీ వీవోఎల్‌టీఈ వంటి ఫీచర్లను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేయనున్నారు. రిపబ్లిక్ డే సంధర్భంగా ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మైక్రోమ్యాక్స్ విడుదల చేసే అవకాశం ఉంది.

లో కాస్ట్ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ని

ఇండియాలో లో కాస్ట్ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ని సొంతం చేసుకునే భాగంలో ఆండ్రాయిడ్ ఓరియో గోను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే అన్ని టెల్కోల కంపెనీలు అత్యంత తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టాలని చూస్తున్నాయి.

ఎనిమిదవది..

కాగా ఆండ్రాయిడ్ ఓరియో మొబైల్ ఫోన్ ఓఎస్ లో ఎనిమిదవది. ఈ ఓఎస్ 1జిబి కన్నా తక్కువ ఉన్న ఫోన్లలో కూడా సమర్థవంతంగా రన్ అవుతుంది. ఈ వర్షన్ లో గూగుల్ అన్ని ఫీచర్లు లభ్యమవుతాయి.

Mi A1కు

షియోమి ఇప్పటికే ఆండ్రాయిడ్ ఓరియో అప్ డేట్ ని Mi A1కు అందించింది. రూ. 15 వేల బడ్జెట్ రేంజ్ ఫోన్లలో షియోమినే ఫస్ట్ ఆండ్రాయిడ్ ఓరియో అప్ డేట్ అందుకుందని కంపెనీ చెబుతోంది.

దేశీయ కంపెనీలు అత్యంత తక్కువ ధరకే..

ఆండ్రాయిగ్ గో ఆపరేటింగ్ సిస్టం వర్షన్ తో దేశీయ కంపెనీలు అత్యంత తక్కువ ధరకే ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసే అవకాశం ఉందని గూగుల్ ధీమా వ్యక్తం చేస్తోంది. వీటి ధర 30 డాలర్ల లోపే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

 

Android Oreo Go Edition

Android Oreo Go Edition గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Micromax to launch first Android Go smartphone this month More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot