దేశీయ దిగ్గజం తొలి సవాల్, తొలి ఆండ్రాయిడ్ గో మొబైల్ మనదే !

By Hazarath
|

దేశీయ దిగ్గజం మైక్రోమ్యాక్స్ దేశంలోకి తొలిసారిగా ఆండ్రాయిడ్‌ ఓరియో(గో ఎడిషన్‌) స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాబోతోంది. ఇండియాలో తొలి ఆండ్రాయిడ్‌ ఓరియో(గో ఎడిషన్‌) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. రిపబ్లిక్ డే సంధర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. దేశంలో ఆండ్రాయిడ్‌ ఓరియో గో-స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేస్తున్న తొలి కంపెనీ మైక్రోమ్యాక్సే కావడం గర్వించదగ్గ పరిణామం. కాగా భారత్ గో పేరుతో కంపెనీ ఈ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ వస్తోంది, డిస్కౌంట్లపై ఓ కన్నేయండి !అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ వస్తోంది, డిస్కౌంట్లపై ఓ కన్నేయండి !

ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ డివైజ్‌..

ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ డివైజ్‌..

512MB to 1GB RAMతో వచ్చే అవకాశం ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను బెస్ట్‌-ఇన్‌-క్లాస్‌ మొబిలిటీ డివైజ్‌, ఆప్టిమైజ్ ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ డివైజ్‌గా కంపెనీ అభివర్ణించింది.

ఐదు వేల రూపాయల కంటే తక్కువగానే..

ఐదు వేల రూపాయల కంటే తక్కువగానే..

ఐదు వేల రూపాయల కంటే తక్కువగానే ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర ఉంటుందని, 4జీ, వాయస్‌ఓవర్‌ ఎల్‌టీఈ సపోర్టు ఫీచర్లతో ఇది మార్కెట్‌లోకి వస్తుందని తెలిపింది. ఆండ్రాయిడ్‌ ఓరియో(గో ఎడిషన్‌)తో ఇది రన్‌ అవుతుంది.

ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియోతో ..
 

ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియోతో ..

ఎంట్రీ లెవల్‌ డివైజ్‌లు మంచిగా పనిచేయడానికి ఆండ్రాయిడ్‌ గో ఎడిషన్‌ను గూగుల్‌ లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియోతో దీన్ని లాంచ్‌ చేస్తున్నట్టు గత నెలలోనే గూగుల్‌ పేర్కొంది. ఈ ఓఎస్ ముఖ్యంగా 1జీబీ కంటే తక్కువ ర్యామ్, తక్కువ స్టోరేజ్‌ స్పేస్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్లలో అతివేగంగా పనిచేస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, ధర

స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, ధర

ఫీచర్‌ ఫోన్‌ పాపులర్‌గా ఉన్న గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో స్మార్ట్‌ఫోన్‌ వాడకాన్ని పెంచడానికి ఈ ఓఎస్‌ దోహదం చేస్తుంది. ఆండ్రాయిడ్‌ గో ఎడిషన్‌తో వస్తున్న భారత్‌ గో స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లను, ధరను మైక్రోమ్యాక్స్‌ వెల్లడించనప్పటికీ, తొలిసారి స్మార్ట్‌ఫోన్‌ వాడే యూజర్లకు ఇది మంచి అనుభూతిని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

 గో ఫీచర్లో..

గో ఫీచర్లో..

కాగా ఈ గో ఫీచర్లో Google Go, Google Assistant Go, YouTube Go, Google Maps Go, Gmail Go, Gboard, Google Play, Chrome, and the new Files Go app by Google లాంటి గూగుల్ ఫీచర్లు ఉంటాయి.

Best Mobiles in India

English summary
Micromax Bharat Go, the first Android Oreo Go Edition smartphone will launch later this month More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X