స్మార్ట్‌ఫోన్+టాబ్లెట్= మైక్రోమ్యాక్స్ ఫాబ్లెట్!

Posted By: Super

స్మార్ట్‌ఫోన్+టాబ్లెట్= మైక్రోమ్యాక్స్ ఫాబ్లెట్!

మొబైల్ ఫోన్‌లను తయారు చేయటంలో దేశీయంగా ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న మైక్రోమ్యాక్స్ అధిక ముగింపు స్పెసిఫికేషన్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేసింది.

ఈ సంస్థ డిజైన్ చేసే స్మార్ట్ హ్యాండ్‌సెట్లు పటిష్టమైన బ్యాటరీ వ్యవస్థతో పాటు సమర్థవంతమైన డ్యూయల్ సిమ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. మార్కెట్ వ్యూహాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ భవిష్యత్ వ్యూహాలను రచిస్తున్న మైక్రోమ్యాక్స్, స్మార్ట్‌ఫోన్ ఇంకా టాబ్లెట్ కలయకతో కూడిన ఆండ్రాయిడ్ ఫాబ్లెట్‌ను వృద్ధి చేసింది. ‘ఏ100’ మోడల్‌లో డిజైన్ కాబడిన ఈ బహుళ ప్రయోజనకారి ధర రూ.9,999.

ఫీచర్లు (అంచనా):

5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్),

డ్యూయల్ సిమ్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

మైక్రోఎస్టీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పెంచుకునే సౌలభ్యత,

5 మెగాపిక్సల్ కెమెరా,

శక్తివంతమైన 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ధర ఇతర వివరాలు:

ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ‘హోమ్‌షాప్18’ మైక్రోమ్యాక్స్ ఏ100ను రూ.9,999కు ఆఫర్ చేస్తోంది. ఈ నెలాఖరు నుంచి వీటిని విక్రయించే అవకాశం ఉంది. సమర్థవంతమైన స్పెసిఫికేషన్‌లతో విడుదల కాబోతున్న మైక్రోమ్యాక్స్ ఏ100, స్పైస్ హారిజాన్ ఇంకా సామ్‌సంగ్ గెలాక్సీ నోట్‌లకు గట్టి పోటినిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఫాబ్లెట్ కింగ్ సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఫీచర్లు:

* 5.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్, * 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, * 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, * 1జీబి ర్యామ్, * 16జీబి, 32జీబి వేరియంట్‌లలో ఇంటర్నల్ స్టోరేజ్,

* మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఎక్సటర్నల్ మెమరీ, * జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, * బ్లూటూత్, యూఎస్బీ సపోర్ట్, * 2జీ, 3జీ నెట్‌వర్క్ సపోర్ట్, * ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, * గేమ్స్, ఎఫ్ఎమ్ స్టీరియో రేడియో, * బ్యాటరీ బ్యాకప్ 820 గంటలు, * ఆండ్రాయిడ్ v2.3.5 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, * 1.4 GHz ఆర్మ్ కార్టెక్స్ – ఏ9 డ్యూయల్ కోర్ ప్రాసెసర్, * ఆడోబ్ ప్లాష్, HTML బ్రౌజర్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot