మైక్రోమ్యాక్స్ నుంచి మరో సూపర్ ఫోన్!

ఇండియన్ మొబైల్ తయారీ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ ‘ఏ45 పుంక్’ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది. నింజా సిరీస్ నుంచి వస్తున్న ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ మునుపటి ఫోన్ నింజా ఏ50కి కాస్త పెద్దదిగా ఉంటుంది. ఏ45 పుంక్ ముందస్లు బుకింగ్‌కు సంబంధించి మైక్రోమ్యాక్స్ అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను పొందుపరిచారు. ధర రూ.5,499.
ఫీచర్లు:
3.5 అంగుళాల స్ర్కీన్ డిస్‌ప్లే,
ప్రాక్సిమిటీ సెన్సార్,
ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
650మెగాహెడ్జ్ ప్రాసెసర్,
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
2 మెగా పిక్సల్ కెమెరా,
అయిషా వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్,
256ఎంజీ ర్యామ్,
ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ 32జీబి,
వై-ఫై,
3జీ కనెక్టువిటీ.
అయిషా అంటే..?
Aisha అంటే ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ స్పీచ్ హ్యాండ్‌సెట్ అసిస్టెంట్’. ఈ అప్లేకేషన్ పదాలను చర్యలలోకి అనువదించగలదు. అంటే నోటీ ద్వారా మీరు ఇచ్చే కమాండ్‌లకు ఈ అప్లికేషన్ ప్రతిస్పందిస్తుంది. ఉదాహరణకు: ‘What is the weather in vijayawada’ అని మీరు వాయిస్ కమాండ్ ఇస్తే టక్కన ‘The weather will be rainy and cool’అని సమాధానం ఇస్తుంది.
మైక్రోమ్యాక్స్ ఏ50:
డ్యూయల్ సిమ్ సౌలభ్యతతో పాటు ఆధునిక ఫీచర్లతో సుసంపన్నమైన మైక్రోమ్యాక్స్ ఏ50 , ఆండ్రాయిడ్ వోఎస్ ఆధారితంగా పనిచేస్తుంది. ఈ ఫోన్లో Aisha అనే వాయిస్ కమాండ్ అప్లికేషన్‌ను నిక్షిప్తం చేశారు. సిరీ వాయిస్ కమాండ్ అప్లికేషన్ తరహాలో ఈ ఫీచర్ పని చేస్తుంది. ఈ సౌలభ్యతతో మాటలు ఆధారితంగా డివైజ్ స్పందించడం మొదలుపెడుంది.
ఫీచర్లు:
డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్,
టచ్ స్ర్కీన్,
2మెగా పిక్సల్ రేర్ కెమెరా,
ఆడియో ప్లేయర్,
వీడియో ప్లేయర్,
ఇన్‌బుల్ట్ గేమ్స్,
లౌడ్ స్సీకర్స్,
ఆడియో జాక్,
నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ,3జీ),
కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ సపోర్ట్, హెచ్ టిఎమ్ఎల్ బ్రౌజర్),
ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
650మెగాహెడ్జ్ ప్రాసెసర్,
1200mAh బ్యాటరీ (స్టాండ్‌బై 240 గంటలు, టాక్‌టైమ్ 4 గంటలు),
ధర అంచనా రూ.4999.


Click it and Unblock the Notifications