అందమైన స్మార్ట్‌ఫోన్ ‘ఫోటోగ్యాలరీ’!

Posted By: Prashanth

Micromax A57 Ninja 3

 

ఆధునిక ఫీచర్లతో కూడిన ఫీచర్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌లను వినియోగదారులకు చేరువచేస్తూ సామాన్యుని నేస్తంగా గుర్తింపుతెచ్చుకున్న దేశవాళీ సంస్థ మైక్రోమ్యాక్స్ ఇండియా తాజాగా ఏ57 నింజా 3 పేరుతో సరికొత్త డ్యూయల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌పోన్‌ను ప్రకటించింది.

స్పెసిఫికేషన్‌లు:

డ్యూయల్ సిమ్, 3.5 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్), 1గిగాహెర్జ్ క్వాల్కమ్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 2.3.5 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 256 ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, బ్లూటూత్ వర్షన్ 2.1, వై-ఫై 802.11 b/g/n, యూఎస్బీ 2.0 కనెక్టువిటీ, 1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్ టైమ్ 8.5 గంటలు, స్టాండ్ బై 177 గంటలు).

Read In English

ఫీచర్లు:

ఫోన్‌లో నిక్షిప్తం చేసిన ప్రీలోడెడ్ అప్లికేషన్స్ (మైజోన్, మైఎస్ఎంఎస్, గ్రావిటీ సెన్సార్, హుక్ అప్ అప్లికేషన్, ఫేస్‌బుక్, ఎఫ్ఎమ్ రేడియో), ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై టూ కలర్ బ్యాక్ ప్యానల్‌ను ఉచితంగా పొందవచ్చు. సెప్టంబర్ 2 నుంచి ఏ57 నింజా 3 మార్కెట్లో లభ్యమవుతుంది. ధర రూ.4,999.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot