30 రోజుల బ్యాటరీ లైఫ్‌తో మైక్రోమాక్స్ ‘కాన్వాస్ హ్యు’
‘కాన్వాస్ హ్యు' పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మైక్రోమాక్స్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ధర రూ.10,999. ఈ ఫోన్ లో నిక్షిప్తం చేసిన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 30 రోజుల బ్యాటరీ లైఫ్ ను సమకూర్చగలదని కంపెనీ హామీ ఇస్తోంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
కార్నింగ్ గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో కూడిన 5 అంగుళాల సూపర్ అమోల్డ్ 720 పిక్సల్ హైడెఫినిషన్ డిస్ ప్లేను ఈ ఫోన్ లో ఏర్పాటు చేసినట్లు మైక్రోమాక్స్ తెలిపింది. ఆండ్రాయిడ్ 4.4.2 ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ లాలీపాప్), 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా. కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ, జీపీఎస్), గోల్డ్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.
ఫోన్ అమ్మకాలు అన్ని ఆఫ్‌లైన్ ఇంకా ఆన్‌లైన్ మార్కెట్‌లలో జనవరి 16 నుంచి ప్రారంభం కానున్నాయి.


Click it and Unblock the Notifications








