మైక్రోమ్యాక్స్ మళ్లి వచ్చేసింది!

Posted By: Super

 మైక్రోమ్యాక్స్ మళ్లి వచ్చేసింది!

దేశీయ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘ఏ84 సూపర్ ఫోన్ ఎలైట్’ను మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.9999. ఆకట్టకునే ఫీచర్లతో డిజైన్ కాబడిన ఈ డివైజ్ పెట్టుబడికి పూర్తి విలువను చేకూరుస్తుంది.

ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

3.97 అంగుళాల ఐపీఎస్ wvga డిస్‌ప్లే (రిసల్యూషన్ 800X400),

1గిగాహెట్జ్ ప్రాసెసర్,

5 మెగా పిక్సల్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్),

0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

బ్లూటూత్ వర్షన్ 2.1,

వై-పై,

3జీ,

యూఎస్బీ కనెక్టువిటీ,

అయిషా వాయిస్ కమాండ్ అప్లికేషన్,

జీపీఎస్,

1630ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్ టైమ్ 5 గంటలు, స్టాండ్ బై 160 గంటలు),

ఎక్సప్యాండబుల్ మెమెరీ 32జీబి.

ఆండ్రాయిడ్ వోఎస్ ఆధారితంగా పనిచేసే ఈ ఫోన్లో Aisha అనే వాయిస్ కమాండ్ అప్లికేషన్‌ను నిక్షిప్తం చేశారు. సిరీ వాయిస్ కమాండ్ అప్లికేషన్ తరహాలో రూపుదిద్దుకున్న ఈ ఫీచర్ క్లోజ్ ఫ్రెండ్ లాంటి ఫీలింగ్‌ను చేరువచేస్తుంది.

అయిషా వాయిస్ కమాండ్ అప్లికేషన్ ప్రత్యేకత:

Aisha అంటే ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ స్పీచ్ హ్యాండ్‌సెట్ అసిస్టెంట్’. ఈ అప్లేకేషన్.. పదాలను చర్యలలోకి అనువదించగలదు. అంటే నోటీ ద్వారా మీరు ఇచ్చే కమాండ్‌లకు ఈ అప్లికేషన్ ప్రతిస్పందిస్తుంది. ఉదాహరణకు: ‘What is the weather in vijayawada’ అని మీరు వాయిస్ కమాండ్ ఇస్తే టక్కన ‘The weather will be hot and humid’అని సమాధానం ఇస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot