మైక్రోమ్యాక్స్ van gogh x450 సింప్లీ అదుర్స్

By Super
|
Van Gogh X450
మైక్రోమ్యాక్స్ ఇండియాలో జాతీయంగా మంచి పేరున్న మొబైల్ తయారీదారు. ఇండియా మొత్తం మీద ఖచ్చితమైన, నాణ్యతమైన మొబైల్స్‌ని అందించడంలో మైక్రోమ్యాక్స్‌ది అందెవేసిన చేయి. ఇది మాత్రమే కాకుండా తక్కవ ధరలో కూడా మంచి మోడళ్లను అందిస్తుంది. రాబోయే కొన్ని నెలలో మైక్రోమ్యాక్స్ నుండి కొన్ని కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. మైక్రోమ్యాక్స్ త్వరలో విడుదల చేయనున్న Van Gogh X450 మొబైల్ ఫీచర్స్ ఈరోజు తెలసుకుందాం...

మైక్రోమ్యాక్స్ Van Gogh X450 చూడడానికి చాలా చక్కగా ఆల్ట్రా మోడ్రన్ మాదిరి కొత్త ఫచర్స్ తోటి మార్కెట్‌‌లోకి విడుదల కానుంది. ఈ మొబైల్‌లో ఉన్న అతి పెద్ద ఫీచర్ ఏమిటంటే ఈ మొబైల్‌తో పాటు డాక్ బ్లూటూత్ హెడ్ సెట్ స్టాండర్డ్ ఆఫ్షన్‌గా వస్తుంది. మైక్రోమ్యాక్స్ Van Gogh X450 స్టైలిష్ బార్ ఫోన్. Van Gogh X450 మొబైల్ ముందు భాగం గ్లాస్ కోట్ వేయబడిఉంది. డైమన్షన్స్‌లో చాలా తేలికగా ఉండి స్క్ర్రీన్ సైజు దాదాపు 6.1సెంటిమీటర్లు ఉంటుంది. యూజర్ చేతుల్లో చాలా తేలికగా ఇమడమే కాకుండా, మొబైల్ ఉపయోగించడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

అంతేకాకుండా ఈ మొబైల్‌కి Van Gogh అని పేరు పెట్టడానికి కారణం సన్ ప్లవర్స్ పెయింగ్ మాదిరి ఉంటుంది కాబట్టి. ఇక మొబైల్ వెనుక భాగాన ఉన్నటువంటి పసుపు కలర్ రంగు చూడడానికి ఇట్టే ముద్దు వచ్చే విధంగా ఉంటుంది. ఇక మల్టీమీడియా విషయానికి వస్తే మ్యూజిక్‌ని ఎంజాయ్ చెయ్యడానికి చక్కని మ్యూజిక్ ప్లేయర్‌తో, వీడియో ప్లేయర్ సపోర్టింగ్, అన్ని రకాలైనటువంటి వీడియో ఫార్మెట్స్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. వీటితోపాటు ఈ మొబైల్‌ని పర్సనల్ కంప్యూటర్‌కి కనెక్ట్ చేసుకోవడానికి 3.5mm ఆడియో జాక్‌తో పాటు, యఫ్ ఎమ్ రేడియోని కూడా ఉంది.

ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే బ్లూటూత్, యుఎస్‌బి సపోర్ట్, జిపిఆర్ ఎస్ సపోర్ట్ లను అందిస్తుంది. ఇక ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేసుకునేందుకు గాను ఇందులో ప్రత్యేకంగా ఒపేరా బ్రౌజర్ ఇనిస్టాల్ చేసి ఉంటుంది. వీడియో రికార్డింగ్ చేసుకునేందుకు ఇందులో మంచి క్వాలిటీ కెమెరా కూడా ఉంది. ఇక జావా కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి గేమ్స్‌ని ఇందులో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Micromax Van Gogh X450 features:

Bluetooth Dongle headset
2 Mega Pixel camera
Music and Video player
FM radio
8GB expandable memory
Java
Bluetooth and GPRS

ఇండియాలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా దీని ధరని నిర్ణయించడం జరిగింది. దీని ధర కేవలం రూ 3500. త్వరలోనే ఇండియన్ మార్కెట్‌లో ఈ మొబైల్ విడుదల కానుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X