మైక్రోమాక్స్ నుంచి రెండు విండోస్ ఫోన్ 8.1 స్మార్ట్‌ఫోన్‌లు.. జూన్ 16నే ముహూర్తం

Posted By:

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో దేశీయంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న మైక్రోమాక్స్ తన ప్రస్థానంలో మొట్టమొదటి సారిగా విండోస్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేయబోతోంది. జూన్ 16న కొత్తఢిల్లీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మైక్రోమాక్స్ రెండు విండోస్ ఫోన్‌లను ప్రదర్శించనుందని ఓ ప్రముఖ మీడియా పోర్టల్ కథనాన్ని ప్రచురించింది.

 మైక్రోమాక్స్  విండోస్ స్మార్ట్‌ఫోన్‌లు.. అతిత్వరలో!!

విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే ఈ హ్యాండ్‌సెట్‌లలో ఒక రకం హ్యాండ్‌సెట్ ఖరీదు రూ.10,000 నుంచి రూ.11,000 మధ్య మరో రకం హ్యాండ్‌సెట్ ధర రూ.6,000 నుంచి రూ.7,000 మధ్య ఉండొచ్చని సదరు మీడియా అంచనావేస్తోంది. కాన్వాస్ సిరీస్ నుంచి ఈ ఫోన్‌లను మైక్రోమాక్స్ విడుదల చేయనుందట. అయితే, ఈ విండోస్ ఫోన్‌ల విడుదలకు సంబంధించి మైక్రోమాక్స్ నుంచి ఇప్పటివరకు ఏవిధమైన అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరోవైపు మార్కెట్లో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న సెల్‌కాన్ మొబైల్స్‌ వచ్చే అగష్టులో విండోస్ 8.1 స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఫోన్ ధర రూ.10,000లోపు ఉంటుందని సెల్‌కాన్ మొబైల్స్ డిజిటల్ మేనేజిమెంట్ హెడ్ వై. ప్రదీప్ మా గిజ్‌బాట్ ప్రతినిధికి తెలిపారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting