నాన్‌స్టాప్‌ప్‌ప్‌‌ప్‌ప్‌ప్‌ప్...(దూసుకుపోతోంది)!

By Super
|

 నాన్‌స్టాప్‌ప్‌ప్‌‌ప్‌ప్‌ప్‌ప్...(దూసుకుపోతోంది)!


దేశీయ మొబైల్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ మార్కెట్లో మొబైల్ ఫోన్‌ల వర్షం కురిపిస్తోంది. మధ్యతరగతి వినియోగదారులే లక్ష్యంగా ఈ బ్రాండ్ వివిధ శ్రేణుల్లో మొబైల్ హ్యాండ్‌సెట్‌లను విడుదల చేస్తుంది. తాజాగా ‘నింజా 2, ఏ56’ పేరుతో ఆండ్రాయిడ్

జింజర్‌బ్రెడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది. 800 మెగాహెట్జ్ క్లాక్ వేగాన్ని కలిగిన క్వాల్కమ్ ప్రాసెసర్‌ను ఈ డివైజ్‌లో వినియోగించారు. ర్యామ్ సామర్ధ్యం 256ఎంబీ. ర్యామ్ సామర్ధ్యం తక్కువుగా ఉండటంతో ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టంను ఫోన్ సపోర్ట్ చెయ్యలేదు. ఇతర ఫీచర్లు...

 

- ఆకర్షణీయమైన డిజైనింగ్,

- డ్యూయల్ సిమ్,

- 3.5 అంగుళాల టచ్ స్ర్కీన్ (టీఎఫ్ టీ ఎల్ సీడీ టైప్),

- 3 మెగా పిక్సల్ కెమెరా,

- ఫోన్ మెమరీని మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ సౌలభ్యతతో 32జీబికి పెంచుకోవచ్చు,

- అయిషా(AISHA) వాయిస్ అసిస్టెంట్ ఫీచర్,

- సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్స్,

- 3జీ కనెక్టువిటీ, వై-ఫై,

- బ్లూటూత్ (వర్షన్ 2.1), యూఎస్బీ (2.0),

- 3.5ఎమ్ఎమ్ హెడ్ సెట్ జాక్,,

- గ్రావిటీ సెన్సార్, లైట్ సెన్సార్,

- లితియమ్-ఐయాన్ 1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్ టైమ్ 4.5 గంటలు, స్టాండ్ బై 180 గంటలు),

- బరువు 94 గ్రాములు,

- ధర అంచనా రూ.5,999.

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X