మైక్రోమ్యాక్స్ గేమింగ్ సర్వీస్ మొబైల్స్

Posted By: Staff

మైక్రోమ్యాక్స్ గేమింగ్ సర్వీస్ మొబైల్స్

మైక్రోమ్యాక్స్ మంచి ఉత్తమమైన మొబైల్స్‌కి ప్రసిద్ది. మైక్రోమ్యాక్స్ త్వరలో తన కంపెనీ నుండి గేమింగ్ మొబైల్స్‌ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తుంది. మైక్రోమ్యాక్స్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ప్రస్తుతం ఇండియాలో ఎక్కువగా టీనేజర్స్ మొబైల్స్ పై ఆసక్తిని చూపించడం ఒకటికాగా, రెండవది అన్ని ఫీచర్స్ ఉన్న మొబైల్స్‌ని అధికంగా ఇష్టపడడమే ఇందుకు కారణం అని అన్నారు. అందుకే ఇండియాలో ఉన్న టీనేజర్స్, కాలేజి స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకోని ఈ గేమింగ్ మొబైల్స్‌‍ని విడుదల చేస్తున్నామన్నారు. ఐతే గతంలో నోగియా కూడా ఇలాంటి ప్రయోగం చేసింది. నోకియా విడుదల చేసిన N-Gage Gaming ఫోన్ తక్కువ ఫీచర్స్ ఉండడంతో ఎక్కువగా అమ్మకాలను నమోదు చేసుకోలేక పోయాయి.

మంచి ఫీచర్స్ ఉన్న గేమింగ్ మొబైల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేసినట్లైతే అతి తక్కువ కాలంలో రికార్డు స్దాయి అమ్మకాలను నమోదు చేయవచ్చునని మైక్రోమ్యాక్స్ వర్గాలు తెలిపాయి. దీనికి కారణం మార్కెట్లో మంచి గేమింగ్ మొబైల్ ఇప్పటివరకు రాకపోవడమేనని అన్నారు. అందుకే మైక్రోమ్యాక్స్ అలాంటి గేమింగ్ మొబైల్ కోసం కసరత్తు ప్రారంభించింది. మైక్రోమ్యాక్స్ ఇండియన్ మొబైల్ కంపెనీ అన్న విషయం అందరికి తెలిసిందే. నజారా టెక్నాలజీతో కలసి ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ గేమ్ టైటిల్స్‌ని కొన్నింటిని సెలెక్ట్ చేసుకొని యూజర్స్ కోసం ప్రత్యేకంగా డెమో లను అందుబాటులోకి తెచ్చింది మైక్రోమ్యాక్స్ కంపెనీ.

మైక్రోమ్యాక్స్ ప్రవేశపెట్టినటువంటి ట్రైల్ పాకెజేస్ నచ్చినట్లైతే గేమ్ లకు సంబందించి పుల్ వర్సన్‌ను కొనుగోలు చేయవచ్చునని తెలిపింది. నజారా టెక్నాలజీస్ అనేది ఇండియాలో ఎలక్ట్రానిక్ గేమ్స్ కు మంచి ప్రసిద్ది. యూజర్స్ ఎవరైనా ట్రైల్ వర్సన్ నచ్చి పుల్ వర్సన్ కొనుగోలు చేయాలనుకునే వారు పుల్ వర్సన్ రేటు చాలా ఎక్కువగా ఉంటుందని మాత్రం అనుకోకండి. ఆ రేటు కేవలం రూ 49 నుండి మొదలు కోని రూ 99 వరకు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. దీనితో పాటు రోజువారి కూడా ఈ గేమ్స్‌ని ఆడుకోవచ్చు. ఇందుకు మాత్రం రోజుకి రూ 3 చెల్లించాల్సి వస్తుంది.

మైక్రోమ్యాక్స్‌కు ఉన్నటువంటి కస్టమర్స్‌ని పెంచుకోవడంలో భాగంగానే మైక్రోమ్యాక్స్ ఈ గేమింగ్ సర్వీస్ లను ప్రారంభిస్తుందని అన్నారు. గేమింగ్ సర్వీస్‌ని లాంఛ్ చేసిన కొన్ని వారాలకే మైక్రోమ్యాక్స్ Q80 హ్యాండ్ సెట్‌కి సంబంధించిన ZMail Push mail service గురించి ప్రస్తావించడం జరిగింది. అసలు మైక్రోమ్యాక్స్ ఈ గేమింగ్ సర్వీస్‌ను విడుదల చేయడం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే జనాభా దృష్టిని గేమింగ్ సర్వీస్ మొబైల్స్ వైపు మరల్చడమే. ఐతే మైక్రోమ్యాక్స్ ప్రస్తుతానికి గేమింగ్ సర్వీస్‌ని అందించే మొబైల్స్ ఏవేవి అనేవి ఇంకా చెప్పలేదు. ఆ మొబైల్స్ ఏమనేవి త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot