చూడగానే మతి పోగొట్టే అందం దీని సొంతం...

Posted By: Staff

చూడగానే మతి పోగొట్టే అందం దీని సొంతం...

దేశీయ మొబైల్ దిగ్గజం మైక్రోమ్యాక్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొబైల్ యూజర్స్ కోసం ప్రత్యేకంగా స్పెషల్ ఫోన్స్‌ని రూపోందిస్తున్న విషయం తెలిసిందే. మైక్రోమ్యాక్స్ ఎప్పుడు కూడా యూజర్ ప్రెండ్లీ మొబైల్స్‌‌నే రూపోందిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న రూమర్ ప్రకారం మైక్రోమ్యాక్స్ త్వరలో ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి అత్యంత అధ్బుతమైన ఫీచర్స్ కలిగిన ఫోన్‌ అతి తక్కువ ధరలో విడుదల చేయనుందని సమాచారం. ఎంతో స్టయిలిష్‌‌గా, వివిధ కలర్స్‌లలో లభ్యం కానున్న ఈ మొబైల్ పేరు మైక్రో మ్యాక్స్ క్యూ56.

ఇండియన్ మొబైల్ మార్కెట్లో ప్రస్తుతం హాట్ టాఫిక్ డ్యూయల్ సిమ్ ఫోన్లు. దీనిని దృష్టిలో పెట్టుకోని మైక్రోమ్యాక్స్ క్యూ56ని డ్యూయల్ సిమ్ ఫీచర్‌తో మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించడానికి గాను దీని స్క్రీన్ సైజు 2.4 ఇంచ్ డిస్ ప్లేగా రూపోందించడం జరిగింది. స్క్రీన్ రిజల్యూషన్ 320 x 240 ఫిక్సల్‌గా రూపోందించడం జరిగింది. మైక్రోమ్యాక్స్ క్యూ56ని చూసిన ఏ యూజరైనా ఈ మొబైల్‌కి వెంటనే ఆకర్షితులు అవుతారని తెలిపారు. 2 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండడం వల్ల చక్కని ఇమేజిలను హై క్వాలిటీ వీడియోలను తీయవచ్చు.

మొబైల్‌తో పాటు కొంత మొమొరీ లభిస్తుండగా ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 8జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇంటర్నెట్‌ని వినియోగించుకునేందుకు వీలుగా మైక్రోమ్యాక్స్ క్యూ56 మొబైల్‌లో వెబ్ బ్రౌజర్ ఓపెరా మినిని నిక్షిప్తం చేయడం జరిగింది. ఎంటర్టెన్మెంట్ విషయంలో కూడా యూజర్స్‌ని నిరాశకు గురి చేయదు. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. మైక్రోమ్యాక్స్ క్యూ56 మొబైల్‌కి అదనంగా ఎప్‌ఎమ్ రేడియో ఫెసిలిటీ ప్రత్యేకం. మైక్రోమ్యాక్స్ క్యూ56 అతి ముఖ్యమైన స్పెషాలిటీ ఏమిటంటే క్వర్టీ కీ ప్యాడ్. దీని సహాయంతో యూజర్స్ మెసేజింగ్, ఈ మెయిల్స్‌ని ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. ఇండియన్ మొబైల్ మార్కెట్లో మైక్రోమ్యాక్స్ క్యూ56 మొబైల్ ధర సుమారుగా రూ 4,000గా ఉండవచ్చునని నిపుణుల అంచనా.

మైక్రోమ్యాక్స్ క్యూ56 మొబైల్‌ స్ఫెషల్ ఫీచర్స్:

* Buttons are studded with Swarovski crystal
* FM Recording + Micro SD Card
* Web Browsing
* Dual GSM Sim (GSM+GSM)
* 2 Megapixel Camera
* GSM 900/1800 MHz
* GPRS/WAP
* 2.4” inch QVGA Display Screen
* 2MP Camera with Video and Zoom
* Memory Card up to 8GB
* Web browser opera mini
* SMS/MMS
* Stereo FM Radio
* MP3, MIDI, WAV Player and Video Player
* 850 mAh Battery
* Up to 4 hours of talk time
* Up to of 180 hours of standby time
* Dimensions : 70 x 70 x 16.3 mm

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot