డిసెంబర్‌లో మైక్రోమ్యాక్స్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు!

Posted By:

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్ అంతర్జాతీయంగా తన పరిధిని మరింత విస్తరింపజేసేందుకు సరికొత్త వ్యూహాలతో ముందుసాగుతున్నట్లు సమాచారం. మైక్రోమ్యాక్స్ తన మార్కెట్ పరిధిని రష్యన్ మార్కెట్లోకి విస్తరింపచేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు ఇంటర్నెట్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. విండోస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పన పైనా మైక్రోమ్యాక్స్ దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా, మైక్రోమ్యాక్స్‌కు సంబంధించిన మరో ఆసక్తికర వార్త వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తోంది.

 డిసెంబర్‌లో మైక్రోమ్యాక్స్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు!

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఇండియన్ మార్కెట్లో డిసెంబర్ నాటికి 4జీ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను మైక్రోమ్యాక్స్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు పలు కథనాలు వ్యక్తమవుతున్నాయి. మరో బ్రాండ్ ‘జోలో' కూడా ఇదే సమయంలో 4జీ నెట్‌వర్క్ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

ఇటీవల కాలంలో ముకేశ్ అంబానీ సారథ్యంలోని రియలన్స్ జియో ఇన్పోకామ్‌కు దేశ వ్యాప్తంగా వాయిస్ టెలిఫోనీ ఇంకా 4జీ హైస్పీడ్ డేటా సర్వీసులను అందించేందుకు యూనిఫైడ్ లైసెన్సు లభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవాళీ మొబైల్ తయారీ కంపెనీలైన మైక్రోమ్యాక్స్ ఇంకా కార్బన్‌లు రియలన్స్ జియో ఇన్పోకామ్‌తో ఒప్పందం కుదుర్చుకుని 4జీ ఎల్టీఈ డివైజ్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయునున్నట్లు సమాచారం. ప్రస్తుతం, ఎయిర్‌టెల్ దేశంలో ఎంపిక చేయబడిన పట్టణాలకు 4జీ సర్వీసులను అందిస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot