మైక్రోమాక్స్‌కు మంచి రోజులు రాబోతున్నాయా..?

ఒకప్పటి సంచలన బ్రాండ్ మైక్రోమాక్స్, చైనా బ్రాండ్‌ల రాకతో చతికిలబడిన విషయం తెలిసిందే. తాజాగా చోటుచేసుకుంటోన్న పరిణామాలను బట్టి చూస్తుంటే మైక్రోమాక్స్‌కు మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయన్నది స్పష్టమవుతోంది.

Read More : హై-ఎండ్ ఫీచర్లతో మైక్రోమాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ, రూ.9,999కే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Micromax Canvas Infinity

ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే నిన్న మార్కెట్లో లాంచ్ అయిన Micromax Canvas Infinity స్మార్ట్‌ఫోన్. రూ.9,999 ధర ట్యాగ్‌లో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌‌లో హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లను తలపించేలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.

షియోమీ, ఒప్పో, వివోలకు ధీటైన జవాబునిచ్చేలా...

bezel-less డిజైన్‌, 18:9 aspect ratio డిస్‌ప్లే, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి శక్తివంతమైన ఫీచర్లతో లాంచ్ అయిన కాన్వాస్ ఇన్ఫినిటీ ఫోన్ షియోమీ, ఒప్పో, వివో వంటి బ్రాండ్‌లకు థీటైన జవాబునిచ్చేలా ఉంది.

రూ.9,000 నుంచి రూ.15,000 రేంజ్‌లో..

కాన్వాస్ ఇన్ఫినిటీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తరువాత మైక్రోమాక్స్ వ్యూహం పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తోంది. ఇక పై ఇటువంటి ట్రెండ్‌ను కొనసాగిస్తూ రూ.9,000 నుంచి రూ.15,000 రేంజ్‌లో బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను బరిలోకి దింపాలని మైక్రోమాక్స్ భావిస్తోంది.

చైనా స్మార్ట్‌ఫోన్‌ల పట్ల వ్యతిరేకత..

వచ్చే ఆరు నెలల కాలంలో కనీసం 10 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకోవాలన్నది మైక్రోమాక్స్ లక్ష్యంగా తెలుస్తోంది. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ను పరిశీలించినట్లయితే ఒప్పో, వివో వంటి బ్రాండ్‌లకు ఎదురుగాలి వీస్తోంది. చైనా స్మార్ట్‌ఫోన్‌ల పట్ల ఇండియన్స్‌లో వ్యక్తమవుతోన్న వ్యతిరేకత కూడా మైక్రోమాక్స్‌కు కలిసొచ్చేలా ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Micromax Says It Will Get Its Mobile Volume Leadership Back.Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot