రూ.1999కే 4జీ VoLTE ఫోన్

4G VoLTE ఫోన్‌లకు దేశవ్యాప్తంగా డిమాండ్ మిన్నంటిన నేపధ్యంలో ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ కారుచౌక ధరల్లో రెండు సరికొత్త 4జీ వోల్ట్ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. భారత్ 1, భారత్ 2 మోడల్స్‌లో రాబోతున్న ఈ ఫోన్‌లలో మొదటిది ఫీచర్ ఫోన్ కాగా, రెండవది స్మార్ట్‌ఫోన్.

రూ.1999కే 4జీ VoLTE ఫోన్

Read More : నోకియా 6 దమ్మెంతో చూస్తారా..?

జావా ఆధారిత ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే భారత్ 1 ఫోన్ ధరను రూ.1999గా మైక్రోమాక్స్ నిర్ణయించినట్లు సమాచారం. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే భారత్ 2 స్మార్ట్‌ఫోన్ ధరను రూ.2,999గా నిర్ణయించినట్లు సమాచారం. బ్యాంకింగ్ ఫీచర్లతో రాబోతున్న ఈ ఫోన్‌లు, మొబైల్ తయారీ కంపెనీల మధ్య మరింత పోటీ పెంచే అవకాశం ఉంది.

రూ.1999కే 4జీ VoLTE ఫోన్

మరో రెండు వారాల్లో ఈ హ్యాండ్‌సెట్‌లను మార్కెట్లోకి రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా 5 నుంచి 6 కోట్ల భారత్ 1, భారత్ 2 ఫోన్‌లను విక్రయించాలన్నది మైక్రోమాక్స్ లక్ష్యంగా తెలుస్తోంది. మార్కెట్ డిమాండ్‌ను బట్టి భారత్ 3 ఫోన్‌ను కూడా రంగంలోకి దింపేందుకు మైక్రోమాక్స్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

Read More : స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీని శాసిస్తోన్న ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.999కే జియో ఫోన్

కనివినీ ఎరగని ఉచిత ఆఫర్లతో ఇండియన్ టెలికామ్ సెక్టార్‌లోకి పెను ఉప్పెనలా దూసుకుపోతున్న రిలయన్స్ జియో ఇటు ఫీచర్ ఫోన్ మార్కెట్‌ను కూడా కీలకంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫీచర్ ఫోన్ మార్కెట్లో సరికొత్త ఒరవడికి నాంది పలుకుతూ రూ.990 నుంచి రూ.1500 రేంజ్‌లో 4G VoLTE ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు సమాచారం.

గేమ్ ఛేంజర్‌..

ఇండియన్ మొబైల్ మార్కెట్లో గేమ్ ఛేంజర్‌గా భావిస్తోన్న ఈ చౌక ధర 4జీ వోల్ట్ ఫోన్‌లు త్వరలోనే మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశముందని సమాచారం.

లైవ్ టీవీ, జియో చాట్, జియో వాలెట్

జియో కారుచౌక 4జీ ఫీచర్ ఫోన్‌లలో VoLTE ఫీచర్‌తో పాటు ముందు వెనకా కెమెరాలను కలిగి ఉండే ఈ ఫోన్‌లు ఉచిత్ కాల్స్‌ను ఆఫర్ చేయటంతో పాటు MyJio యాప్ సూట్‌లోని లైవ్ టీవీ, జియో చాట్, జియో వాలెట్,వీడియో ఆన్ డిమాండ్ వంటి యాప్‌లను కూడా సపోర్ట్ చేస్తాయని తెలుస్తోంది.

టీ9 కీబోర్డ్‌తో..

జియో ఫీచర్ ఫోన్‌లకు సంబంధించిన మొదటి ఇమేజ్ తాజాగా ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. టీ9 కీబోర్డ్‌తో వస్తోన్న ఈ ఫీచర్ ఫో‌న్‌లో D-Pad మరో ఆకర్షణగా నిలిచింది. కీబోర్డ్ పై భాగంలో ఏర్పాటు చేసిన ఈ డీ-ప్యాడ్‌లో మై జియో, జియో లైవ్ టీవీ, జియో వీడియో, జియో మ్యూజిక్ యాప్స్ వంటి షార్ట్‌కట్ బటన్‌లను జియో ఏర్పాటు చేసినట్లు లీకైన ఫోటో ద్వారా తెలుస్తోంది. టార్చ్ లైట్ నిమిత్తం ప్రత్యేకమైన బటన్‌ను కూడా జియో ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని స్పెసిఫికేషన్స్ రివీల్ కావల్సి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే



English summary
Micromax Set to Launch Bharat 1 and Bharat 2 4G VoLTE Phones at Rs 1,999 and Rs 2,999. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting