మైక్రోమాక్స్ నుంచి వాటర్ ఇంకా డస్ట్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్!

|

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ తయారీ విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ‘మైక్రోమాక్స్' దృఢమైన స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పన పై దృష్టిసారించనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వాటర్ ప్రూఫ్, డస్ట్ రెసిస్టెంట్ వంటి కఠినమైన ఫీచర్లతో రూపకల్పన చేయబడిన ఓ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను మైక్రోమాక్స్ త్వరలో అందుబాటులోకి తీసుకురానుందని ఇంటర్నెట్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

మైక్రోమ్యాక్స్ స్ప్లాష్... త్వరలో!!

‘మైక్రోమ్యాక్స్ స్ప్లాష్' (Micromax Splash) పేరుతో విడుదల కాబోతున్న ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్ ఐపీ67 సర్టిఫికేషన్‌ను కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ విధమైన గుర్తింపు కలిగిన స్మార్ట్‌ఫోన్, మీటరు లోతైన నీటిలో 30 నిమిషాల పాటు మునిగి ఉన్నప్పటికి ప్రమాదం ఉండదు. ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలకు సంబంధించిన సమాచారం త్వరలోనే అధికారికంగా వెల్లడవుతుంది.

4000ఎమ్ఏహెచ్ బ్యాటరీతో మైక్రోమాక్స్ కాన్వాస్ పవర్

‘కాన్వాస్ పవర్' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మైక్రోమాక్స్ తాజాగా విడుదల చేసింది. శక్తివంతమైన 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలగి ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ధర రూ.9,900. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌లను మైక్రోమాక్స్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా విక్రయిస్తున్నారు. బుక్ చేసుకున్న వారికి 7 నుంచి 10 బిజినెస్ దినాలలో డెలివరీ ఉంటుంది.

మైక్రోమాక్స్ కాన్వాస్ పవర్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

5 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 1.3గిగాహెట్జ్ మీడియాటెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ, 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X