2014 నుంచి భారత్‌లోనే మైక్రోమాక్స్ ఫోన్‌ల అసెంబ్లింగ్!

Posted By:

భారతదేశపు ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ వచ్చే ఏడాది నుంచి తన స్మార్ట్‌ఫోన్‌ల అసెంబ్లింగ్ ప్రక్రియను రుద్రపూర్ ప్లాంట్‌లో ప్రారంభించనుంది. స్మార్ట్‌ఫోన్‌ల వ్యాపారంలో చురుకుగా ముందుకుసాగుతున్న మైక్రోమాక్స్ తాజాగా యూరోప్ ఇంకా రష్యా మార్కెట్లలోకి ప్రవేశించేందుకు హాలీవుడ్ హీరో హ్యూ జాక్మాన్‌ను ప్రచారకర్తగా ఎంపిక చేసుకుంది. మరోవైపు ఇండియన్ మార్కెట్లో 4జీ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

2014 నుంచి భారత్‌లోనే మైక్రోమాక్స్ ఫోన్‌ల అసెంబ్లింగ్!

దేశంలో మైక్రోమాక్స్ ఫోన్‌ల అసెంబ్లింగ్ ప్రక్రియను ప్రారంభించే అంశాన్ని మైక్రోమాక్స్ సహవ్యవస్థాపకులు రాహూల్ శర్మ పీటీఐతో తెలిపారు. తమకు రుద్రపూర్‌లో ఓ తయారీ ప్లాంట్ ఉందని, ఇప్పటికే ఇక్కడ ట్రెయిల్ ప్రాతిపదికన మొబైల్‌ఫోన్ల అసెంబ్లింగ్ ప్రారంభమైందని, వాణిజ్యపరంగా వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం నుంచి ఇక్కడ పూర్తిస్థాయిలో అసెంబ్లింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని శర్మ తెలిపారు. 400 మంది ఇక్కడ పొందనున్నారు.

ప్రస్తుతం, మైక్రోమ్యాక్స్ ఫాక్స్‌కాన్ వంటి సంస్థలో ఒప్పందాన్ని ఏర్పరుచుకుని చైనా వంటి దేశాల నుంచి ఫోన్‌లను దిగుమతి చేసుకుంటోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో 6,000 కోట్ల టర్నవోర్ సాధించే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు శర్మ పీటీఐకు ఇంటర్వ్యూలో తెలిపారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot