సూపర్ ఫోన్ ఫీచర్లేంటి..?

Posted By: Prashanth

సూపర్ ఫోన్ ఫీచర్లేంటి..?

 

ప్రముఖ మొబైల్ ఫోన్ల ఉత్పత్తిదారు మైక్రోమ్యాక్స్ సరికొత్త ఫీచర్లతో ‘సూపర్ ఫోన్ లైట్ A75’ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా పనిచేసే ఈ స్మార్ట్ మొబైల్ గ్యాడ్జెట్ వినియోగదారుడికి నూటికి నూరు శాతం సంతృప్తిని కలగజేస్తుంది.

స్టైలిష్ రేంజ్ లో డిజైన్ కాబడిన ‘మైక్రోమ్యాక్స్ సూపర్ ఫోన్’ వినియోగదారుడి హుందాని పెంచుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. కంప్యూటింగ్ లావాదేవీలతో పాటు నిరంతర వినోదాన్ని శ్రోత ఆస్వాదించవచ్చు. రూ.9,000 ధరకు లభ్యమవుతున్న ఈ అత్యాధునిక సూపర్ మొబైల్ మీ బంధాలను మరింత పటిష్టితం చేస్తుం

ఫీచర్లు:

* ఆండ్రాయిడ్ వర్షన్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* 650MHz ప్రాసెసర్,

* స్ర్కీన్ పరిమాణం 3.8 అంగుళాలు,

* రిసల్యూషన్ 320 x 480 పిక్సల్స్,

* పటిష్టమైన టచ్ స్ర్కీన్ డిస్ ప్లే,

* రెండు కెమెరాలు (ఫ్రంట్ 0.3 మెగా పిక్సల్, వెనుక 3 మెగా పిక్సల్),

* నాణ్యమైన వీడియో రికార్డింగ్,

* మల్టీ మీడియా ప్లేయర్,

* ఎఫ్ఎమ్ రేడియో,

* ఎక్సటర్నల్ మెమరీని 16జీబి వరకు పెంచుకునే సౌలభ్యత,

* 3.5 mm హెడ్ ఫోన్ మరియు ఆడియో జాక్,

* బ్లూటూత్,

* వై-ఫై, వాప్ (WAP), యూఎస్బీ (USB)

* సోషెల్ నెట్ వర్కింగ్ అప్లికేషన్లను మొబైల్ లో ముందుగానే లోడ్ చేశారు.

* ఆండ్రాయిడ్ మార్కెట్లో యాక్సిస్ అయ్యే సౌలభ్యత,

* గుగూల్ వాయిస్ సెర్చ్ మరియు గుగూల్ మ్యాప్స్,

* 1300 mAh సామర్ధ్యం గల నాణ్యమైన లితియమ్ ఐయాన్ బ్యాటరీ వ్యవస్థ, బ్యాకప్ 8 గంటలు,

* ఫోన్ చుట్టుకొలతలు 63.5 mm x 120 mm x 10.9 mm,

* బరువు 135 గ్రాములు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot