ఆ కొత్త ఫార్ములా తలరాతను మార్చేస్తుందా..?

Posted By: Staff

 ఆ కొత్త ఫార్ములా తలరాతను మార్చేస్తుందా..?

భవిష్యత్ ప్రణాళికలో భాగంగా మైక్రోమ్యాక్స్ , ప్రాసెసర్‌ల తయారీ సంస్థ మీడియా టెక్‌ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. మీడియా టెక్ సమకూర్చే డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌లను తాము రూపొందించే తక్కువ ధర (10,000కు దిగువ ధర) స్మార్ట్‌ఫోన్‌లలో వినియోగించేందుకు మైక్రోమ్యాక్స్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. తాజాగా ఈ చిప్‌మేకర్ ఎమ్ టి6577 పేరుతో డ్యూయల్ కోర్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. 1 గిగాహెట్జ్ సామర్ధ్యం గల డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్‌ను ఒదిగి ఉన్నఈ ప్లాట్‌ఫామ్

ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం అదేవిధంగా 3G/HSPA+”>HSPA మోడెమ్‌లకు అనుకూలంగా వ్యవహరిస్తుంది.

మీడియో టెక్ రూపొందించిన ఈ డ్యూయల్ కోర్ చిప్‌సెట్ ఉత్తమ పనితీరుతో కొత్త తరహా అనుభూతికి‌లోను చేస్తుంది. ఈ చిప్‌సెట్ వినియోగం వల్ల మొబైల్ కనెక్టువిటీ, యూజర్ ఇంటరాక్టివిటీ, మల్టీమీడియా వంటి అంశాలు మరింత మెరుగైన పనితీరును ప్రదర్శిస్తాయి.

ఎమ్‌టి6577 డ్యూయల్ కోర్ ప్లాట్‌ఫామ్ సపోర్ట్ చేసే అంశాలు:

8 మెగాపిక్సల్ కెమెరా,

హైడెఫినిషన్ వీడియో ప్లేబ్యాక్ (1080 పిక్సల్),

హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ (720 పిక్సల్),

డ్యూయల్ బ్యాండ్ 802.11n వై-ఫై,

బ్లూటూత్ 4.0 కనెక్టువిటీ.

ఈ చిప్‌సెట్ ఆధారితంగా పనిచేసే తొలి స్మార్ట్‌ఫోన్ మరో మూడు నెలలో మార్కెట్లో లభ్యం కానుంది. దేశీయ బ్రాండ్‌లైన మైక్రోమ్యాక్స్, లావా, స్పైస్ తదితర సంస్థలకు మీడియా టెక్ ప్రాసెసర్‌లను సరఫరా చేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot