13 మెగా పిక్సల్ కెమెరాతో మైక్రోమాక్స్ కాన్వాస్ సెల్ఫీ

Posted By:

13 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా సామర్థ్యంతో కూడిన ‘కాన్వాస్ సెల్ఫీ' (Canvas Selfie) స్మార్ట్‌ఫోన్‌ను మైక్రోమాక్స్ సోమవారం ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. జనవరి రెండో వారం నుంచి ఈ ఫోన్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ధర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

13 మెగా పిక్సల్ కెమెరాతో మైక్రోమాక్స్ కాన్వాస్ సెల్ఫీ

సెల్ఫీ ఫీచర్ ప్రధాన ఆకర్షణగా ఉన్న ఈ హ్యాండ్‌సెట్‌లో ఎల్ఈడి ఫ్లాష్ సామర్ధ్యంతో కూడిన 13 మెగా పిక్సల్ కెమెరాను ఏర్పాటుచేసారు. ఏంజెలిక్ వైట్ ఇంకా మిస్టిక్ బ్లూ కలర్ వేరియంట్‌లలో లభ్యంకానున్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు....

4.7 అంగుళాల 720 పిక్సల్ ఐపీఎస్ డిస్‌ప్లే (గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ మీడియాటెక్ ఆక్టాకోర్ సీపీయూ,
16జీబి ఇంటర్నల్ మెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ ప్రత్యేకతతో),
13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ ప్రత్యేకతతో),
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్ కనెక్టువిటీ),
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Micromax Unveiled Smartphone With 13mp Front Facing Camera. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot