రూ.4,440కే బ్రాండెడ్ 4జీ VoLTE ఫోన్, జియో సిమ్ ఉచితం

ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ రెండు సరికొత్త 4జీ VoLTE స్మార్ట్‌ఫోన్‌లను మైక్రోమాక్స్ బుధవారం మార్కెట్లో లాంచ్ చేసింది. మైక్రోమాక్స్ Vdeo 1, Vdeo 2 మోడల్స్‌‌లో లాంచ్ అయిన ఈ ఫోన్‌ల ధరు రూ.4,440, రూ.4,990గా ఉన్నాయి. గూగుల్ డ్యుయో యాప్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లు జియో ఆఫర్ చేస్తున్న 'హ్యాపీ న్యూ ఇయర్' ఆఫర్‌ను కూడా సపోర్ట్ చేయటం విశేషం..

Read More : ఫోన్ చేస్తే చాలు, డబ్బు ట్రాన్స్‌ఫర్ చేస్తారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో సిమ్ పూర్తిగా ఉచితం..

ఈ ఫోన్‌లతో పాటుగా జియో సిమ్‌లను మైక్రోమాక్స్ ఉచితంగా అందిస్తోంది. ఈ జియో సిమ్‌లను యాక్టివేషన్ చేసుకోవటం ద్వారా మార్చి 31, 2017 వరకు జియో కాల్స్ ఇంకా ఇంటర్నెట్‌ను ఉచితంగా ఆస్వాదించవచ్చు.

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి

మైక్రోమాక్స్ Vdeo 1 ఫోన్ 4 అంగుళాల WVGA డిస్‌ప్లేతో, Vdeo 2 ఫోన్ 4.5 అంగుళాల FWVGA డిస్‌ప్లేలతో వస్తున్నాయి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్..

ఈ రెండు ఫోన్‌లు ఎంట్రీ లెవల్ 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ చిప్‌సెట్‌లతో వస్తున్నాయి. 1జీబి ర్యామ్ అలానే 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఈ ఫోన్‌లలో చూడొచ్చు. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

ఆపరేటింగ్ సిస్టం..

ఈ రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి Vdeo 1 ఫోన్ 1600 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో, Vdeo 2 ఫోన్ 1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తున్నాయి.

కెమెరా సపోర్ట్...

కెమెరా విషయానికి వచ్చేసరికి ఈ రెండు ఫోన్‌లు 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తున్నాయి. జియో నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే విధంగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో 4జీ VoLTE ఫీచర్‌ను పొందుపరిచారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Micromax Vdeo 1, Vdeo 2 Launched with VoLTE, Prices Start from Rs.4,440. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot