రూ.999కే 4జీ స్మార్ట్‌ఫోన్, షరతులు వర్తిస్తాయి !
మొబైల్ మార్కెట్లో దూసుకుపోయేందుకు దేశీయ దిగ్గజం మైక్రోమ్యాక్స్ రోజురోజుకు సరికొత్తగా ఆఫర్లను ప్రకటిస్తూ పోతోంది.
మొబైల్ మార్కెట్లో దూసుకుపోయేందుకు దేశీయ దిగ్గజం మైక్రోమ్యాక్స్ రోజురోజుకు సరికొత్తగా ఆఫర్లను ప్రకటిస్తూ పోతోంది. మొన్న బిఎస్ఎన్ఎల్‌తో జట్టు కట్టి రూ. 2200కే బారత్ 1 4జీ లాంచ్ చేసిన విషయం మరువక ముందే వొడాఫోన్ తో కలిసి సరికొత్త ఆఫర్‌ను అందించేందుకు రెడీ అయింది. ఈ ఆఫర్లో భాగంగా వినియోగదారులు రూ.999కే 4జీ ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే ఈ ఫోన్ పై జియోలాగా కొన్ని కండీషన్లను ప్రవేశపెట్టింది.

రూ. 999కే స్మార్ట్‌ఫోన్..
మైక్రోమ్యాక్స్ వొడాఫోన్‌తో కలిసి రూ. 999కే స్మార్ట్‌ఫోన్ లభించేలా ఓ సరికొత్త స్కీమ్ ను ప్రకటించింది. వినియోగదారులు కొన్ని కండీషన్లతో ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

భారత్ 2 అల్ట్రా' ఫోన్..
మైక్రోమ్యాక్స్ విడుదల చేసిన 'భారత్ 2 అల్ట్రా' ఫోన్ ధర రూ. 2,899 కాగా, ఇదే ఇప్పుడు రూ.999కి లభిస్తోందని కంపెనీ చెబుతోంది. అది ఎలాగంటే దీన్ని వాడిన యూజర్లు ఆ తరువాతి కాలంలో రూ. 1,900 రీఫండ్ పొందవచ్చని పేర్కొంది.

రీఫండ్ పొందాలంటే కస్టమర్లు వోడాఫోన్ సిమ్
ఈ రీఫండ్ పొందాలంటే కస్టమర్లు వోడాఫోన్ సిమ్‌ను వాడాల్సి వుంటుందని కంపెనీ తెలిపింది. తొలి ఏడాదిన్నర తరువాత రూ. 900, ఆపై మరో ఏడాదిన్నర తరువాత రూ. 1000 క్యాష్ బ్యాక్ అవుతుందని, దీంతో రూ. 2,899కి కొన్న ఫోన్ రూ. 999కే వచ్చినట్టు అవుతుందని తెలిపింది.

మరో మెళిక ..
అయితే దీనితో పాటు కంపెనీ మరో మెళిక కూడా పెట్టింది. ఈ రీఫండ్ సౌకర్యం పొందాలంటే యూజరు ప్రతినెలా కనీసం రూ. 150తో రీచార్జ్ చేసుకోవాల్సి వుంటుందని మైక్రోమ్యాక్స్ పేర్కొంది.

భారత్ 2 ఆల్ట్రా ఫీచర్ల విషయానికి వస్తే..
భారత్ 2 ఆల్ట్రా ఫీచర్ల విషయానికి వస్తే, 4 జీబీ మెమొరీ, 512 ఎంబీ ర్యామ్, 1.3 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 4 అంగుళాల టచ్ స్క్రీన్, 2/0.3 ఎంపీ కెమెరాలు, 1,300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్ తదితర సదుపాయాలున్నాయని కంపెనీ వెల్లడించింది.

జియో, Airtel ఫోన్లకి ఇది..
లోఎండ్‌లో లభించే స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే, మెరుగైన ఫీచర్లనే ఇది కలిగివుందని చెప్పవచ్చు. మరి జియో, Airtel ఫోన్లకి ఇది ఏ మాత్రం పోటీనిస్తుందోనని చూడాలి.


Click it and Unblock the Notifications








