మైక్రోమాక్స్ విండోస్ ఫోన్ 8.1 స్మార్ట్‌ఫోన్!

Posted By:

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌పోన్‌ల విభాగంలో సంచలనాల దిశగా దూసుకువెళుతున్న మైక్రోమాక్స్ ఇటీవల కాలంలో విండోస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను డిజైన్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మైక్రోమాక్స్ డిజైన్ చేస్తున్న విండోస్ 8.1 ఫోన్‌కు సంబంధించి పలు ఆసక్తికర వివరాలు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి. జూలైలో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారభమయ్యే అవకాశముందని @LeaksterInc పేర్కొంది. ఫోన్ ధర రూ.23,000 నుంచి రూ.25,000 మధ్య ఉండొచ్చట. మైక్రోమాక్స్ తొలి విండోస్ ఫోన్ ఫీచర్లకు సంబంధించి పలు ఆసక్తికర వాదనలు ఇంటర్నెట్‌లో వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ ఫీచర్లను విశ్లేషించినట్లయితే.....

మైక్రోమాక్స్ విండోస్ ఫోన్ 8.1 స్మార్ట్‌ఫోన్!

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే,
విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot