మైక్రోమ్యాక్స్ కూల్ హ్యాండ్ సెట్ X222

Posted By: Super

మైక్రోమ్యాక్స్ కూల్ హ్యాండ్ సెట్ X222

దేశీయ మొబైల్ దిగ్గజం మైక్రోమ్యాక్స్ అందమైన చూడచక్కని టచ్ స్క్రీన్ మొబైల్ ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. దాని పేరు మైక్రోమ్యాక్స్ ఎక్స్ 222. సాధారణంగా మైక్రోమ్యాక్స్ చక్కని హ్యాండ్ సెట్స్‌తో పాటు ఎక్కువ ఫీచర్స్‌తో తక్కువ ధర కలిగిన మొబైల్స్‌ని విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇకపోతే మైక్రోమ్యాక్స్ ఎక్స్ 222 మొబైల్ ఫోన్‌ని మైక్రోమ్యాక్స్ కంపెనీ డ్యూయల్ సిమ్ కేటగిరిలో విడుదల చేసింది.

మైక్రోమ్యాక్స్ ఎక్స్ 222 మొబైల్స్ చుట్టుకొలతలు 92 x 52 x 14 mmగా ఉన్నాయి. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందింజేందుకు 2.4 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే దీని సొంతం. మైక్రోమ్యాక్స్ ఎక్స్ 222 ఒకే ఒక్క కెమెరా విషయంలో యూజర్స్‌ని నిరాశకు గురిచేస్తుంది. ఎందుకంటే మైక్రోమ్యాక్స్ ఎక్స్ 222 ఫోన్ కేవలం 0.3 మెగా ఫిక్సల్ విజిఎ కెమెరాని కలిగి ఉంది. కెమెరా ఫిక్సల్ తక్కువ అయినప్పటికీ ఇమేజీ క్లారిటీ మాత్రం ఏమంత బ్యాడ్‌గా ఉండదు.

ఎంటర్టెన్మెంట్ విషయానికి వస్తే ఇందులో ఆడియో, వీడియో ప్లేయర్స్ సూపర్బ్ క్వాలిటీని అందిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న అన్నిరకాల ఆడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తాయి. పవర్ మేనేజ్ మెంట్ విషయానికి వస్తే ఇందులో 900 mAh Lithium ion బ్యాటరీ నిక్షిప్తం చేయడం జరిగింది. కంటిన్యూగా మాట్లాడినట్లైతే బ్యాటరీ బ్యాక్ అప్ 6 గంటలు వస్తుంది. అదే మొబైల్‌ని స్టాండ్ బైలో ఉంచితే బ్యాటరీ బ్యాక్ అప్ 157 గంటలు వస్తుంది.

మొబైల్‌తో పాటు ఇంటర్నెల్‌గా కొంత మొమొరీ లభిస్తుండగా ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని కేవలం 8జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది.
చేతిలో ఇమిడే విధంగా మొబైల్ బరువు కూడా కేవలం 83 గ్రాములుగా రూపోందిచడం జరిగింది. మైక్రోమ్యాక్స్ ఎక్స్ 222 మొబైల్ ధర మార్కెట్లో రూ 2,500గా నిర్ణయించడమైంది.

మైక్రోమ్యాక్స్ ఎక్స్ 222 మొబైల్స్ ఫీచర్స్:

* 6cm LCD Touchscreen display
* 240

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot