రూ 1,850కే మైక్రోమ్యాక్స్ డ్యూయల్ సిమ్

Posted By: Staff

రూ 1,850కే మైక్రోమ్యాక్స్ డ్యూయల్ సిమ్

దేశీయ మొబైల్ దిగ్గజం మైక్రో‌మ్యాక్స్ ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి కొత్త మొబైల్ ఫోన్‌ని విడుదల చేస్తుంది. దానిపేరు మైక్రో‌మ్యాక్స్ ఎక్స్ 230. మైక్రో‌మ్యాక్స్ కంపెనీ నుండి వస్తున్న మరో డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్ 'మైక్రో‌మ్యాక్స్ ఎక్స్ 230'. బ్లాక్ కలర్‌లో మొబైల్ చుట్టు వచ్చిన రెడ్ కలర్ లైన్ మొబైల్‌కే అందం తీసుకొని రావడమే కాకుండా, యూజర్స్ యొక్క మనసు దొచేస్తుంది. విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 2.0 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే‌ని కలిగి ఉంది.

మీ అందమైన మధుర క్షణాలను తీసుకునేందుకు గాను ఇందులో ఉన్న 0.3 మెగా ఫిక్సిల్ విజిఎ కెమెరా ఉపయోగపడుతుంది. మొబైల్‌తో పాటు కొంత ఇంటర్నల్ మెమరీ లభిస్తుండగా, 8జిబి వరకు మెమరీని విస్తరించుకోవచ్చు. ఎంటర్టెన్మెంట్ విషయానికి వస్తే ఇందులో ముందుగానే ప్రీలొడెడ్ గేమ్స్, రేడియో ప్రత్యేకం. మల్టీ మ్యూజిక్ వీడియో ఫార్మెట్లను సపోర్టే చేసేందుకు గాను ఆడియో, వీడియో ప్లేయర్స్ నిక్షిప్తం చేయడం జరిగింది.

ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయ్యేందుకు గాను ఇందులో WAP బ్రౌజర్‌ని అందుబాటులో ఉంచడం జరిగింది. కనెక్టివిటీ ఫీచర్స్ బ్లూటూత్, జిపిఆర్‌ఎస్ ప్రత్యేకం. బ్యాటరీ బ్యాక్ అప్ విషయానికి వస్తే ఇందులో 1200 mAh Li-ion బ్యాటరీని అమర్చడం జరిగింది. దీంతో స్టాండ్ బై టైమ్ సుమారు 792 గంటలు రాగా, టాక్ టైం 5 గంటలు వరకు వస్తుంది.

మైక్రో‌మ్యాక్స్ ఎక్స్ 230 మొబైల్ ధర, ప్రత్యేకతలు:

ధర సుమారుగా రూ: 1,850/-

టైపు: QCIF
సైజు: 2.0”
రిజల్యూషన్: 240X320 Pixels
డ్యూయల్ సిమ్: Yes
జిపిఆర్‌ఎస్: Yes
బ్యాండ్: GSM 900/1800 MHz
ఎఫ్ ఎమ్ రేడియో: Yes
మెసేజింగ్: SMS,MMS
మ్యూజిక్: Multi Format Music Player
వీడియో ఫ్లేయర్: Yes
వీడియో రికార్డర్: Yes
బ్లాటూత్: Yes
కెమెరా: VGA
గేమ్స్: Yes
విస్తరించు మెమరీ: Micro SD up to 2GB
బ్యాటరీ: Li-ion 1200 mAh
టాక్ టైం: Up to 5 Hrs
స్టాండ్ బై టాక్ టైం: Up to 33 days
చుట్టుకొలతలు: 110*47*15.2 mm
బరువు: 110 g

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot