2,000లకే మైక్రో మ్యాక్స్ మ్యూజిక్ ఫోన్..?

Posted By: Staff

2,000లకే మైక్రో మ్యాక్స్ మ్యూజిక్ ఫోన్..?

 

మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా వందల రకాల మొబైల్ ఫోన్‌లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ నేపధ్యంలో సామాన్యుడి బ్రాండ్ మైక్రోమ్యాక్స్ (Micromax) ఉత్తమ సంగీత ప్రమాణాలతో  కూడిన మ్యూజిక్ మొబైల్‌ను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది.

క్వాలిటీ ఆడియోను కోరుకునే వారికి ఈ డివైజ్ ఫర్‌ఫెక్ట్ ఛాయిస్.

మైక్రో‌మ్యాక్స్  X271 మోడల్‌లో రూపుదిద్దుకున్న ఈ ఫోన్ ఫీచర్లు క్లుప్తంగా:

* జీఎస్ఎమ్ నెట్‌వర్క్, డ్యూయల్ సిమ్ సపోర్ట్,  2.6 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, వీజీఏ కెమెరా, వీడియో రికార్డింగ్, ఇన్‌బుల్ట్ ఎఫ్‌ఎమ్ రేడియో, మల్టీ మీడియా ప్లేయర్, 3.5mm ఆడియో జాక్,  8ఎంబీ ఇంటర్నల్ మెమెరీ, 8జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ, WAP / GPRS, బ్లూటూత్, యూఎస్బీ, LED టార్చ్‌లైట్, 15 రోజుల స్టాండ్ బై నిచ్చే  స్టాండర్డ్ లితియమ్ ఐయాన్ బ్యాటరీ,  బరువు 85 గ్రాములు, ధర రూ.2000 నుంచి 2,500 మధ్య  ఉండోచ్చని అంచనా.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot