స్లైడింగ్ ఫీచర్‌తో 'xxx' కాదు 'x78'...

Posted By: Prashanth

స్లైడింగ్ ఫీచర్‌తో  'xxx' కాదు 'x78'...

దేశీయ మొబైల్ దిగ్గజం మైక్రోమ్యాక్స్ ఇటీవల కాలంలో మార్కెట్లోకి డ్యూయల్ సిమ్ ఫీచర్స్‌తో పాటు, టచ్ అండ్ టైపు ఫెసిలిటీ కలిగిన మొబైల్స్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐతే ఇప్పుడు కూడా మార్కెట్లోకి కొత్తగా స్లైడర్ ఫీచర్ కలిగిన టచ్ అండ్ టైపు మొబైల్ ఫోన్‌ 'మైక్రోమ్యాక్స్ ఎక్స్ 78'ని విడుదల చేయనుంది. డ్యూయల్ సిమ్ ఫీచర్ ఇందులో ప్రత్యేకం.

మొబైల్ బరువు 140 గ్రాములు. మార్కెట్లో ఇది రెండు కలర్స్‌లలో లభ్యమవుతుంది. ఒకటి నలుపు కాగా మరొకటి తెలుపు. ఈజీగా నావిగేషన్‌ని ఉపయోగించుకునేందుకు గాను ట్రాక్ ప్యాడ్ ప్రత్యేకం. మొబైల్ వెనుక భాగాన ఉన్న 3.2 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయవచ్చు. 2.8 ఇంచ్ డిస్ ప్లేతో పాటు స్క్రీన్ రిజల్యూషన్ 240 x 320 ఫిక్సల్‌గా రూపొందించడం జరిగింది.

మొబైల్‌తో పాటు వచ్చేటటువంటి ఇంటర్నల్ మెమరీలో కస్టమర్స్ సుమారు 1500 నెంబర్స్, 500 ఎస్‌ఎమ్‌ఎస్ వరకు సేవ్ చేసుకొవొచ్చు. ఇందులో ఉన్న మైక్రో ఎస్‌ స్లాట్ ద్వారా మెమరీని 8జిబి వరకు విస్తరించుకొవొచ్చు. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో  Li-ion 950 mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. మొబైల్ ధర కూడా సామాన్య మద్య తరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా నిర్ణయం తీసుకొవడం జరిగింది. మొబైల్ ధర ఇండియన్ మార్కెట్లో సుమారుగా రూ 5,000/-

మైక్రోమ్యాక్స్ ఎక్స్ 78 మొబైల్ ప్రత్యేకతలు:

* 2.8 inch Touchscreen Display

* Screen Resolution of 240 x 320 pixels

* Dual Sim

* Full QWERTY Keypad

* 3.2 Megapixel Camera

* 4X Digital Zoom

* Multiformat Video/Audio Player

* FM Radio

* 3.5mm audio jack

* Internal memory

* Up to 8GB Expandable micro SD Card

* Bluetooth

* USB

* WAP

* Standard Battery

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot