నోకియా ఐకానిక్ ఫీచర్ ఫోన్ నోకియా 3310కు పోటీగా మైక్రోమాక్స్ సరికొత్త ఫోన్‌ను రంగంలోకి దించబోతోంది. త్వరలోనే ఈ ఫోన్ మార్కెట్లో విడుదల కాబోతోంది.
Bitcoin అంటే ఏంటి, ఖరీదు ఎంత..?
Micromax X1i పేరుతో మార్కెట్లోకి..
అచ్చం నోకియా 3310లానే రూపొందించబడిన ఈ ఫోన్ Micromax X1i పేరుతో మార్కెట్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ధర రూ.1399గా ఉండొచ్చని తెలుస్తోంది.
Amazon Indiaలో
Amazon Indiaలో లిస్ట్ అయి ఉన్న ఈ ఫోన్ ప్రస్తుతానికైతే అందుబాటులో లేదు. స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..
స్పెసిఫికేషన్స్..
2.4 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 320×240 పిక్సల్స్), ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్, వీజీఏ రేర్ ఫేసింగ్ కెమెరా, 32ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 8జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 1300mAh బ్యాటరీ విత్ 2జీ సపోర్ట్.
100 రోజుల రీప్లేస్‌మెంట్ వారంటీతో..
SOS emergency calling ఫీచర్, ఈ ఫోన్‌కు మరో హైలైట్. కీప్యాడ్‌లోని 5 బటన్ పై లాంగ్ ప్రెస్ ఇవ్వటం ద్వారా ఎమర్జెన్సీ కాల్ వెళ్లిపోతుంది. ఎఫ్ఎమ్ రేడియో, ఆటో కాల్ రికార్డింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. మైక్రోమాక్స్ ఈ ఫోన్‌లను 100 రోజుల రీప్లేస్‌మెంట్ వారంటీతో విక్రయించనున్నట్లు తెలుస్తోంది.
నోకియా ధర మరింత ఎక్కువగా ఉండటంతో...
మార్కెట్లో నోకియా 3310 (2017) వర్షన్ ధర రూ.3310గా ఉంది. ధర కాస్త ఎక్కువుగా అనిపంచటంతో నోకియా అభిమానులు సైతం ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఇటువంటి వారికి Micromax X1i బెస్ట్ ఛాయిస్ కావొచ్చు.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.