వదంతులు నమ్మకండి..!

Posted By: Super

వదంతులు నమ్మకండి..!

సాఫ్ట్‌వేర్ దిగ్జజం మైక్రోసాఫ్ట్ తన సొంత హార్డ్‌వేర్ పరిజ్ఞానంతో విండోస్ 8 ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను రూపొందిస్తుందంటూ వస్తున్న వార్తలను విండోస్ ఫోన్ సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ గ్రేగ్ సువిలివ్యాన్ ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో తీవ్రంగా ఖండించారు. తమకు అటువంటి ఆలోచన లేదని నోకియా, హువావీ, హెచ్‌టీసీ, సామ్‌సంగ్ వంటి దిగ్గజ సంస్థలతో కలిసి పనిచెయ్యటం సంతృప్తికరంగా ఉందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, ఆపిల్ ఐప్యాడ్‌కు పోటీగా మైక్రోసాఫ్ట్ తన సొంత హార్డ్‌వేర్ వనరులతో డిజైన్ చేసిన విండోస్ సర్‌ఫేస్ ఆర్‌టి టాబ్లెట్‌కు ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ స్సందన లభిస్తోంది.

విండోస్ సర్‌ఫేస్ ఆర్‌టి ఫీచర్లు:

మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ఆర్‌టి ఫీచర్లు:

10.6 అంగుళాల హై డెఫినిషన్ డిస్‌ప్లే,

.37మిల్లీమీటర్ల మందం,

676 గ్రాముల బరువు,

విండోస్ 8 ఆర్‌టి ఆపరేటింగ్ సిస్ట్ం,

స్టోరేజ్ సామర్ధ్యం 32జీబి, 64జీబి,

పోర్ట్స్ (మైక్రో ఎస్డీ, యూఎస్బీ 2.0, మైక్రో హైడెఫినిషన్ వీడియో, మిమో యాంటీనా),

ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసింగ్ యూనిట్,

ధర ఇంకా విడుదల వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot