మైక్రోసాఫ్ట్ సరికొత్త ఫోన్ ‘నోకియా 225’

Posted By:

మైక్రోసాఫ్ట్ సరికొత్త ఫోన్ ‘నోకియా 225’

దేశంలో మరో కోటి మంది వినియోగదారులను ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ డివైసెస్ మంగళవారం ‘నోకియా 225' పేరుతో సరికొత్త మొబైల్ ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.3,329. ఈ సొగసరి ఫోన్ సింగిల్ ఇంకా డ్యూయల్ సిమ్ వేరియంట్‌లలో లభ్యంకానుంది. ఈ మొబైల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన నోకియా ఎక్స్‌ప్రెస్ బ్రౌజర్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది. నోకియా 225 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే......

2.8 అంగుళాల డిస్‌ప్లే,
2 మెగా పిక్సల్ కెమెరా,
1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఎఫ్ఎమ్ రేడియో, ఎంపీ3 ప్లేయర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot