చరిత్ర పుటల్లోకి విండోస్ ఫోన్లు, యూజర్లకి మరో షాక్

Written By:

ఆండ్రాయిడ్ ఐఫోన్ల దెబ్బకి మైక్రోసాఫ్ట్ ఫోన్లు కనుమరుగు కాక తప్పడం లేదు. ఆండ్రాయిడ్, ఐఫోన్ మార్కెట్ నుంచి వస్తున్న పోటీని తట్టుకోలేక గత కొన్నేళ్లుగా ఏటా విండోస్ ఫోన్ మార్కెట్ షేర్ పడిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా విండోస్ ఫోన్ పని అయిపోయిందని తెలుస్తోంది.

జియో వాయిస్ కాల్స్ కట్, షాక్ తినేది ఈ కస్టమర్లే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భవిష్యత్తులో..

ఈ క్రమంలోనే తాజాగా విండోస్ ఫోన్ పని అయిపోయిందని తెలుస్తోంది. భవిష్యత్తులో విండోస్ 10 మొబైల్ ఓఎస్కు చెందిన మొబైల్ ఫోన్లు మైక్రోసాఫ్ట్ విడుదల చేయబోవడం లేదని కంపెనీ తెలిపింది.

కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ జో బెల్ఫియోరె కారణం

అందుకు ఆ సంస్థకు చెందిన కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ జో బెల్ఫియోరె కారణం. తాజాగా తన ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలను ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.

విండోస్ 10 మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు..

విండోస్ 10 మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు విండోస్ 10 ఫోన్లు తాము కొనసాగించటానికి అవకాశం లేదని, వాటిలో ఇకపై కొత్త ఫీచర్లు రావని, వాటి డెవలప్మెంట్ మీద తాము ఇక దృష్టి పెట్టబోమని ఆయన ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే విండోస్ ఫోన్లు వాడుతున్నవారికి ..

అంతేకాక నేను వ్యక్తిగతంగా ఆండ్రాయిడ్ ఫోన్ ఎప్పుడో మారానని కనుక ఇకపై కాబట్టి ఇకపై విండోస్ ఫోన్ ను వాడనని తెలిపారు.. అయితే ఇప్పటికే విండోస్ ఫోన్లు వాడుతున్నవారికి వాటిలో ఉన్న Windows 10 మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్కు గాను బగ్ ఫిక్స్లు, సెక్యూరిటీ అప్డేట్లు విడుదల చేస్తామని కానీ కొత్త ఫీచర్లు మాత్రం అందించబోమని చెప్పింది.

విండోస్ 10 మొబైల్ ఓఎస్ కథ ..

దీంతో విండోస్ ఫోన్, అలాగే విండోస్ 10 మొబైల్ ఓఎస్ కథ ముగిసిట్టేనని టెక్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Microsoft’s Windows Phone is officially dead, and it’s a good thing Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot