మైక్రోసాఫ్ట్ చౌక ధర ఇంటర్నెట్ ఫోన్ ‘నోకియా 215’

Posted By:

‘నోకియా 215' పేరుతో చౌక ధర ఇంటర్నెట్ ఫోన్‌ను మైక్రోసాఫ్ట్ సీఈఎస్ 2015 వేదికగా ఆవిష్కరించింది. ఈ ఎంట్రీ లెవల్ ఇంటర్నెట్ రెడీ ఫోన్‌లో ఫేస్‌బుక్, మెసెంజర్, ట్విట్టర్, బింగ్ వంటి అప్లికేషన్‌లను ముందుగానే ఇన్‌స్టాల్ చేసి ఉంచారు. ఫోన్ ధర 29 డాలర్లు (భారత్ ప్రస్తుత కరెన్సీ ప్రకారం రూ.1840).

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

 మైక్రోసాఫ్ట్ చౌక ధర  ఇంటర్నెట్ ఫోన్ ‘నోకియా 215’

నోకియా 252 సింగిల్ ఇంకా డ్యుయల్ సిమ్ వేరియంట్‌లలో లభ్యమవుతుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 2.5అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్ (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్), 2జీ, జీపీఆర్ఎస్, బ్లూటూత్ 3.0, నోకియా స్లామ్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను ఫోన్‌లో పొందుపరిచారు. ఫోన్ వెనుక భాగంలో 0.3 మెగా పిక్సల్ సామర్థ్యం గల కెమెరాను ఏర్పాటు చేసారు. ఈ కెమెరా ద్వారా QVGA రిసల్యూషన్ క్వాలిటీతో కూడిన వీడియోలను చిత్రీకరించుకోవచ్చు.

ఈ జనవరిలో విడుదల కాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

1100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (సింగిల్ సిమ్ వేరియంట్ పై 29 రోజుల స్టాండ్ బై టైమ్, డ్యుయల్ సిమ్ వేరియంట్ పై 21 రోజుల స్టాండ్‌బై టైమ్), ఎంపీ3 ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, బ్రైట్ గ్రీన్ ఇంకా బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్‌లలో ఈ ఫోన్ లభ్యంకానుంది. ఇండియన్ మార్కెట్లో నోకియా 215 ఫోన్ అందుబాటుకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

English summary
Microsoft launches Nokia 215 cheap Internet phone for masses. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting