మైక్రోసాఫ్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్@రూ.8,299

Posted By:

నోకియా లుమియా 638 పేరుతో చౌక ధర విండోస్ 4జీ ఫోన్‌ను మైక్రోసాఫ్ట్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయగలిగే ఈ ఫోన్ ధర రూ.8,299. విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం ఈ ఫోన్ పనిచేస్తుంది. అమెజాన్.ఇన్ (Amazon.in) కొత్తగా అందిస్తోన్న మైక్రోసాఫ్ట్ బ్రాండ్ స్టోర్‌లో ఈ పోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా ఆవిష్కరించారు. ఈ డివైస్‌కు సంబంధించిన ప్రీఆర్డర్లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

 మైక్రోసాఫ్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్@రూ.8,299

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

లుమియా 638 స్పెసిఫికేషన్‌లు:

4.5 అంగదుళాల క్లియర్‌బ్యాక్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480x854పిక్సల్స్, 218 పీపీఐ), 1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకోవచ్చు, 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ టీడీ-ఎల్టీఈ, 3జీ, బ్లూటూత్ 4.0, ఏ-జీపీఎస్), 1830 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఈ ఫోన్ కొనుగోలు పై బెంగుళూరులోని పోస్ట్‌పెయిడ్ ఖాతాదారుల కోసం ఎయిర్‌టెల్ 2నెలల వ్యాలిడిటీతో కూడిన 5జీబి 4జీ డేటాను ఉచితంగా ఆఫర్ చేయనుంది. 2015 మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Microsoft launches Nokia Lumia 638, India’s cheapest 4G smartphone. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot