మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్ లుమియా 535@రూ.9,199
అంతా అనుకున్నట్లుగానే మైక్రోసాఫ్ట్ డివైసెస్ బుధవారం తన లుమియా 535 డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. నోకియా బ్రాండ్‌ను పక్కన పెట్టిన తరువాత మైక్రోసాఫ్ట్ బ్రాండ్‌తో వస్తోన్న మొట్టమొదటి లుమియా సిరీస్ ఫోన్ ‘లుమియా 535' కావటం విశేషం. ఈ మైక్రోసాఫ్ట్ బ్రాండెడ్ లుమియా సిరీస్ ఫోన్.. సియాన్, బ్రైట్ గ్రీన్, బ్రైట్ ఆరెంజ్, వైట్, డార్క్ గ్రే ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్ లలో లభ్యమవుతుంది. ధర రూ.9,199.

ఫోన్ కీలక ఫీచర్లను పరిశీలించినట్లయితే...
5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 960 x 540పిక్సల్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం (లుమియా డెనిమ్ అప్‌డేట్‌తో), 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్ కనెక్టువిటీ) పరిమాణం 140.2×72.4×8.8 మిల్లీ మీటర్లు, బరువు 1905 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications