మైక్రోసాఫ్ట్ ఫోన్ ‘లుమియా 535’

Posted By:

నోకియా బ్రాండ్‌ను పక్కనపెట్టిన నేపధ్యంలో మైక్రోసాఫ్ట్ ‘లుమియా 535' పేరుతో తన మొదటి లుమియా బ్రాండెడ్ ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. లుమియా డెనిమ్ అప్‌డేట్‌తో కూడిన విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది. లుమియా 535 విండోస్ స్మార్ట్‌ఫోన్‌ను సింగిల్ ఇంకా డ్యూయల్ సిమ్ వేరియంట్‌లలో నవంబర్ నెలాఖరు నుంచి ప్రముఖ మార్కెట్లలో విక్రయిస్తారు. కార్టానా పేరుతో ప్రత్యేక వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ను లుమియా 535 కలిగి ఉంది.

ఫోన్ కీలక ఫీచర్లను పరిశీలించినట్లయితే:

క్వాడ్‌కోర్ 1.2గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్,
5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 540 x 960),
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
15జీబి వన్ డ్రైవ్ స్టోరేజ్,
కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లూటూత్, HSDPA),
ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు (మైక్రోసాఫ్ట్ ఆఫీస్, స్కైప్, వన్ నోట్),
ఫోన్ బరువు 146 గ్రాములు,
చుట్టుకొలత 140.2 x 72.4 x 8.8మిల్లీ మీటర్లు.

లభ్యమయ్యే కలర్ వేరియంట్స్.. బ్లాక్, సియాన్, బ్రైట్ ఆరెంజ్, బ్రైట్ గ్రీన్, డార్క్ గ్రే. లుమియా 535 స్మార్ట్‌ఫోన్‌లోని 5 అత్యుత్తమ ఫీచర్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోసాఫ్ట్ లుమియా 535... 5 బెస్ట్ ఫీచర్లు

అత్యాధునిక విండోస్ అనుభూతులను లుమియా 535 చేరువ చేస్తుంది. తరచూ ఓవర్ ద ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను పొందవచ్చు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్, స్కైప్, వన్‌నోట్ వంటి ఫీచర్లు ఫోన్ వినియోగాన్ని మరింత పటిష్టం చేస్తాయి.

మైక్రోసాఫ్ట్ లుమియా 535... 5 బెస్ట్ ఫీచర్లు

సెల్ఫీలను అత్యుత్తమంగా చిత్రీకరించుకునేందుకు ఫోన్ ముందు భాగంలో 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు.

మైక్రోసాఫ్ట్ లుమియా 535... 5 బెస్ట్ ఫీచర్లు

విండోస్ ఫోన్ స్టోర్ మరిన్ని యాప్స్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం.

మైక్రోసాఫ్ట్ లుమియా 535... 5 బెస్ట్ ఫీచర్లు

కార్టానా పేరుతో ప్రత్యేక వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ను లుమియా 535లో ఏర్పాటు చేసారు. 

మైక్రోసాఫ్ట్ లుమియా 535... 5 బెస్ట్ ఫీచర్లు

స్కైప్ వీడియో కాలింగ్ సౌకర్యం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Microsoft Lumia 535 Officially Announced: 5 Interesting Features To Know. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot