మైక్రోసాఫ్ట్ తరువాతి ఫోన్ ఇదేనా..?

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మైక్రోసాఫ్ట్ తన తదుపరి సర్‌ఫేస్ ఫోన్‌ను మరింత క్రియేటివ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా లీకైన సమాచారం ప్రకారం మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ఫోన్‌ ఫోల్డబుల్ ఫీచర్లతో రాబోతోదంట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెండు వేరియంట్‌లలో సర్‌ఫేస్ ఫోన్..

ఫోల్డ్ చేసుకునే విధంగా డిజైన్ కాబడుతోన్న ఈ ఫోన్‌ను రెండు వేరియంట్‌లలో మైక్రోసాఫ్ట్ తీసుకురానుందట. సర్‌ఫేస్ పికింగ్ (Surface Peking), సర్‌ఫేస్ స్లావోనియా (Surface Slavonia) అనే కోడ్ నేమ్స్‌తో రానున్న ఈ ఫోన్‌లలో స్పెసిఫికేషన్స్ కూడా వేరువేరుగా ఉంటాయని తెలుస్తోంది.

స్నాప్‌డ్రాగన్ 835 లేదా స్నాప్‌డ్రాగన్ 630

ఈ ఫోన్‌లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 లేదా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 630 సాక్‌లను వినియోగించే అవకాశం ఉందట. మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ మొబైల్స్ Surface Pen సపోర్ట్‌తో కూడా వస్తాయని తెలుస్తోంది.

ప్రొజెక్టర్‌లా ఉపయోగించుకోవచ్చు..

ఈ ఫోన్‌ను ప్రొజెక్టర్‌లా ఉపయోగించుకునేందకుగాను ‘ఆన్-టేబుల్' ప్రొజెక్షన్ ఎబులిటీ సపోర్ట్‌ను కూడా ఈ ఫోన్‌లలో యాడ్ చేయనున్నట్లు సమాచారం. ప్రముఖ డిజైనర్ Bartłomiej Tarnowski మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ఫోన్‌కు సంబంధించి ఓ సరికొత్త కాన్సెప్ట్‌ను వెలుగులోకి తీసుకువచ్చారు.

నిలదొక్కుకునే ప్రయత్నంలోనే విండోస్ మొబైల్స్.

మొబైల్ ఆపరేటింగ్ సిస్టంల విభాగంలో ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్‌ల తమ తమ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ ఇంకా అనౌన్స్‌మెంట్స్‌తో ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ ఫోన్‌లు మార్కెట్ బ్లాక్‌బస్టర్‌లుగా నిలుస్తుండగా విండోస్ మొబైల్ ఫోన్‌లు మాత్రం ఇంకా నిలదొక్కుకునే ప్రయత్నంలోనే ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Microsoft Surface Mobile to support Surface Pen and 'on-table' projection. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot