అత్యంత రహస్యంగా మైక్రోసాఫ్ట్ ఫోన్!

యాపిల్, సామ్‌సంగ్ వంటి దిగ్గజ బ్రాండ్‌లకు ధీటుగా మైక్రోసాఫ్ట్ ఓ రహస్య ఫోన్‌ను అభివృద్థి చేస్తున్నట్లు సమాచారం.

|

నోకియాను కొనుగోలు చేసినప్పటికి ఆశించిన స్థాయిలో స్మార్ట్‌ఫోన్‌ల వ్యాపారం జరగకపోవటంతో, ఆ కంపెనీని హెచ్‌ఎమ్‌డి గ్లోబల్‌కు విక్రయించిన మైక్రోసాఫ్ట్ మొబైల్ ఫోన్‌ల విభాగంలో కాస్తంత డీలా పడినట్లు కనిపించింది. స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో ఎలాగైనా నిలదొక్కుకోవాలనే తపనలో ఉన్న మైక్రోసాఫ్ట్ మరో విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌‌ను అభివృద్థి చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

Read More : జీవితాంతం ఉచిత కాల్స్‌తో బీఎస్ఎన్ఎల్ సంచలన ఆఫర్?

తెరపైకి Surface Phone

తెరపైకి Surface Phone

Lumia సిరీస్ ఫోన్‌లను నిలిపి వేసి వాటి స్థానంలో విప్లవాత్మక ఫీచర్లతో కూడిన Surface Phoneలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధమవుతోన్నట్లు వార్తలు వస్తున్నాయి.

అత్యంత గోప్యంగా..

అత్యంత గోప్యంగా..

యాపిల్, సామ్‌సంగ్ వంటి దిగ్గజ బ్రాండ్‌లకు ధీటుగా డిజైన్ కాబడుతున్నఈ ఫోన్‌ గురించిన కీలక వివరాలు బయటకు పొక్కకుండా మైక్రోసాఫ్ట్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. Surface Phoneకు సంబంధించిన ప్రాజెక్ట్ పనులను ఓ రహస్య స్థావరంలో మైక్రోసాఫ్ట్ నిర్వహిస్తోందట.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంటర్నెట్‌లో ప్రోటోటైప్

ఇంటర్నెట్‌లో ప్రోటోటైప్

తాజా ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రోటోటైప్ చిత్రాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. లీకైన సమాచారం ప్రకారం మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ఫోన్ ఇటీవల మార్కెట్లో అనౌన్స్ కాబడిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 825 చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశముందని తెలుస్తోంది. అదేవిధంగా క్విక్‌ఛార్జ్ 4.0 టెక్నాలజీని కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుందట.

6జీబి ర్యామ్‌, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, 2కే క్వాలిటీ డిస్‌ప్లే

6జీబి ర్యామ్‌, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, 2కే క్వాలిటీ డిస్‌ప్లే

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 825 చిప్‌సెట్‌ తో పాటు 6జీబి ర్యామ్‌ను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేయనున్నారట. ఈ ఫోన్‌కు సంబంధించిన స్ర్కీన్ సైజు, 5 నుంచి 5.5 అంగుళాల మధ్య ఉండొచ్చట. 2కే క్వాలిటీ డిస్‌ప్లేను ఈ ఫోన్ లో నిక్షిప్తం చేసే అవకాశముందని తెలుస్తోంది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే ఈ ఫోన్, కాంటినమ్ మోడ్‌లోని x86 అప్లికేషన్‌లను సపోర్ట్ చేస్తుందట.

సరికొత్త కాన్సెప్ట్‌..

సరికొత్త కాన్సెప్ట్‌..

ప్రముఖ డిజైనర్ Bartłomiej Tarnowski మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ఫోన్‌కు సంబంధించి సరికొత్త కాన్సెప్ట్‌ను వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ కాన్సెప్ట్‌లో ఆయన ప్రస్తావించిన ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం...

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Bezel-less screen

Bezel-less screen

మైక్రోసాఫ్ట్ Surface Phoneను ప్రత్యేకంగా చూపిస్తూ సదరు డిజైనర్ బీజిల్-లెస్ స్ర్కీన్‌ను ఏర్పాటు చేసారు. ఇప్పటి వరకు కొన్ని ZTE Nubia ఫోన్‌లలో తప్పితే ఏ ఒక్క ఫోన్‌లోనూ Bezel-less screen మనకు కనిపంచలేదు.

అదనపు కీబోర్డ్‌..

అదనపు కీబోర్డ్‌..

ఈ డిజైనర్ చూపించిన దాని ప్రకారం మైక్రోసాఫ్ట్ Surface Phoneను అదనపు కీబోర్డ్‌ను కలిగి ఉంది. ఈ డిజైనర్ చూపించిన దాని ప్రకారం మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ఫోన్ 'Surface Pen' సపోర్ట్‌ను కలిగి ఉంటుంది.

ప్రత్యేకమైన ఎల్ఈడి ఫ్లాష్‌లైట్‌

ప్రత్యేకమైన ఎల్ఈడి ఫ్లాష్‌లైట్‌

ఈ డిజైనర్ చూపించిన దాని ప్రకారం మైక్రోసాఫ్ట్ Surface Phone వెనుక భాగంలో మూడు ప్రత్యేకమైన ఎల్ఈడి ఫ్లాష్‌ లైట్‌లను ఏర్పాటు చేసారు.

ఆండ్రాయిడ్ vs విండోస్

ఆండ్రాయిడ్ vs విండోస్

మొబైల్ ఆపరేటింగ్ సిస్టంల విభాగంలో ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్‌ల తమ తమ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ ఇంకా అనౌన్స్‌మెంట్స్‌తో ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ ఫోన్‌లు మార్కెట్ బ్లాక్‌బస్టర్‌లుగా నిలుస్తుండగా విండోస్ మొబైల్ ఫోన్‌లు మాత్రం ఇంకా నిలదొక్కుకునే ప్రయత్నంలోనే ఉన్నాయి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Microsoft Surface Phone to Arrive With Snapdragon 835 and 6GB of RAM Like Samsung Galaxy S8. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X