మైక్రోసాఫ్ట్ 8జీబి ర్యామ్ ఫోన్‌ ఇదేనా..?

గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విండోస్ లుమియా ఫోన్‌లు చేతులెత్తేయటంతో పునారాలోచనలో పడిన సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యూహాత్మక ఎత్తుగుడలతో తన అప్‌కమింగ్ ఫోన్‌ను తయారుచేస్తున్నట్లు సమాచారం.

మైక్రోసాఫ్ట్  8జీబి ర్యామ్ ఫోన్‌ ఇదేనా..?

మైక్రోసాప్ట్ ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేస్తోన్న విండోస్ 10 సర్‌ఫేస్ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో కనువిందు చేయబోతున్నట్లు సమాచారం. 2017లో రానున్న ఈ ఫోన్ స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో సరికొత్త సంచలనంగా నిలవబోతున్నట్లు రూమర్ మిల్స్ అంచనా వేస్తున్నాయి.

Read More : చైనాలో అవి వాడకూడదు..? చూడకూడదు..?

Forbes పత్రిక వెల్లడించిన వివరాలు ప్రకారం, మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 830 ప్రాసెసర్‌తో పాటు కనివిని ఎరగని 8జీబి ర్యామ్‌తో రాబోతున్నట్లు సమాచారం. ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్‌కు సంబంధించి మైక్రోసాఫ్ట్ ఇప్పటి వరకు ఏ విదమైన వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. మైక్రోసాఫ్ట్ గురించి మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు. తెలసుకునేందుకు క్రింది స్లైడ్‌షోలోకి పదండి...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోసాఫ్ట్ గురించి షాకయ్యే నిజాలు

1997‌లో యాపిల్ సంస్థ పెను నష్టాల్లో కూరుకుపోయి దివాలా దిశగా సాగుతున్న వేళ, మైక్రోసాఫ్ట్ అప్పట్లో 150 మిలియన్ డాలర్లు (ప్రస్తుత కరెన్సీలో సుమారు రూ. 1000 కోట్లు) పెట్టుబడిగా పెట్టి ఆదుకుంది.

మైక్రోసాఫ్ట్ గురించి షాకయ్యే నిజాలు

31 సంవత్సరాల వయసులో ప్రపంచంలోనే అతి తక్కువ వయసున్న బిలియనీర్‌గా గుర్తింపు పొందాడు బిల్ గేట్స్. ఆపై ఎనిమిదేళ్ల వయసులోనే 12.9 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 86 వేల కోట్లు) ఆస్తితో అతిపెద్ద ధనవంతుడిగా నిలిచాడు.

మైక్రోసాఫ్ట్ గురించి షాకయ్యే నిజాలు

మైక్రోసాఫ్ట్‌‌లో పనిచేస్తూ ఇప్పటివరకు 12 వేల మందికి పైగా మిలియనీర్లుగా మారారు. వారిలో ఇద్దరు బిలియనీర్లయ్యారు. ఇతర టెక్ కంపెనీలకు ఏదీ సాధ్యం కాని విషయం ఇది.

మైక్రోసాఫ్ట్ గురించి షాకయ్యే నిజాలు

మైక్రోసాప్ట్ సంస్థ వద్ద తొలిరోజుల్లో లోగోను తయారు చేయించేంత డబ్బులు కూడా లేవు. బిల్ గేట్స్, పాల్ అలెన్‌లే స్వయంగా తొలి లోగోను డిజైన్ చేశారు. మధ్యలోని 'ఓ' అక్షరాన్ని వారు 'బిబ్లెట్' (నిక్ నేమ్) అని పిలుచుకునేవారు.

 

మైక్రోసాఫ్ట్ గురించి షాకయ్యే నిజాలు

విండోస్ పీసీని ఆన్ చేయగానే వచ్చే మ్యూజిక్ ను కంపోజ్ చేసింది ప్రముఖ మ్యుజీషియన్ బ్రియాన్ ఎనో. రోలింగ్ స్టోన్స్ ఆల్బమ్ కోసం ఆయన కంపోజ్ చేసిన మ్యూజిక్ నుంచి దీన్ని తీసుకున్నారు.

మైక్రోసాఫ్ట్ గురించి షాకయ్యే నిజాలు

మైక్రోసాఫ్ట్ డిజైన్ చేసిన ఎక్సెల్ ప్రోగ్రామ్ ఆ సంస్థకు ఎనలేని ఖ్యాతిని తెచ్చి పెట్టింది. అప్పటివరకూ ఉన్న యాపిల్ విసీ క్లాక్, లోటస్ 1-2-3 తదితరాలు ఎక్సెల్ రాకతో మాయమైపోయాయి.

మైక్రోసాఫ్ట్ గురించి షాకయ్యే నిజాలు

మైక్రోసాఫ్ట్ వద్ద ఇప్పుడు 48 వేలకు పైగా పేటెంట్లు ఉన్నాయి. ఇంకా సరిగ్గా చెప్పాలంటే, 48.313 రకాల పరిశోధనలు, ప్రొడక్టులపై పూర్తి అధికారం మైక్రోసాఫ్ట్ దే. భవిష్యత్తులో టెక్ ప్రపంచంలో సంచలనం రేపుతుందన్న 'హోలో లెన్స్' హెడ్ సెట్ పై హక్కులూ ఈ సంస్థవే.

 

మైక్రోసాఫ్ట్ గురించి షాకయ్యే నిజాలు

1994లోనే మైక్రోసాఫ్ట్ తొలి స్మార్ట్‌వాచ్‌ని విడుదల చేసింది. టైమెక్స్‌తో కలసి మైక్రోసాఫ్ట్ డిజైన్ చేసిన దీని పేరు డేటా లింక్ 150. ఇది ప్రపంచపు తొలి స్మార్ట్ ఫోన్, ఆపై 12 ఏళ్లకు యాపిల్ స్మార్ట్ ఫోన్ వచ్చింది.

మైక్రోసాఫ్ట్ గురించి షాకయ్యే నిజాలు

1988లో వాషింగ్టన్ సమీపంలో సుమారు 66 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మెడీనా ఎస్టేట్ (గేట్స్ పెట్టుకున్న ముద్దు పేరు క్సనాడు 2.0 ( Xanadu 2.0). దీన్ని 2 మిలియన్ డాలర్లకు ఆయన కొన్నారు. ఇప్పుడు దాని విలువ 123 మిలియన్ డాలర్లు.

 

మైక్రోసాఫ్ట్ గురించి షాకయ్యే నిజాలు

మైక్రోసాఫ్ట్‌లో పని చేస్తున్న ఉద్యోగులు ప్రతి సంవత్సరం దాదాపు 2.3 కోట్ల పానీయాలను ఉచితంగా తాగుతుంటారు. వీటిల్లో ఆత్యధికం పాలు, ఆరంజ్ జ్యూస్ ఉంటాయట.

మైక్రోసాఫ్ట్ గురించి షాకయ్యే నిజాలు

తొలి మ్యకింతోష్ కంప్యూటర్ కోసం సంవత్సరాల తరబడి బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ కలిసి పని చేశారు. మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్‌ను ఎనౌన్స్ చేసిన తరువాత వీరిద్దరి మధ్యా దూరం పెరిగింది. ఇరు కంపెనీల మధ్య వ్యాపార శత్రుత్వం దశాబ్దాలుగా సాగుతోంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Microsoft Surface phone to be power by Snapdragon 830 SoC, 8GB RAM?. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot