ఉత్కంఠ రేపుతోన్న మైక్రోసాఫ్ట్ ఫోన్

స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో నిలదొక్కుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోన్న మైక్రోసాఫ్ట్ మరో విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్లోకి రాబోతోంది. Lumia సిరీస్ ఫోన్‌లను నిలిపి వేసి వాటి స్థానంలో విప్లవాత్మక ఫీచర్లతో కూడిన Surface Phoneలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధమవుతోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 ఉత్కంఠ రేపుతోన్న మైక్రోసాఫ్ట్ ఫోన్

Read More : చైనా బ్రాండ్‌లకు షాక్, రూ.4,500కే సామ్‌సంగ్ 4జీ ఫోన్

2017 ఆరంభంలో ఇవి మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రముఖ డిజైనర్ Bartłomiej Tarnowski మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ఫోన్‌కు సంబంధించి సరికొత్త కాన్సెప్ట్‌ను వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ కాన్సెప్ట్‌లో ఆయన ప్రస్తావించిన ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Bezel-less screen

మైక్రోసాఫ్ట్ Surface Phoneను ప్రత్యేకంగా చూపిస్తూ సదరు డిజైనర్ బీజిల్-లెస్ స్ర్కీన్‌ను ఏర్పాటు చేసారు. ఇప్పటి వరకు కొన్ని ZTE Nubia ఫోన్‌లలో తప్పితే ఏ ఒక్క ఫోన్‌లోనూ Bezel-less screen మనకు కనిపంచలేదు.

కీబోర్డ్ సౌకర్యం...

ఈ డిజైనర్ చూపించిన దాని ప్రకారం మైక్రోసాఫ్ట్ Surface Phoneను అదనపు కీబోర్డ్‌ను కలిగి ఉంది.

సామ్‌సంగ్ స్టైలస్ తరహాలో సర్‌ఫేస్ ఫోన్

ఈ డిజైనర్ చూపించిన దాని ప్రకారం మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ఫోన్ 'Surface Pen' సపోర్ట్‌ను కలిగి ఉంటుంది.

ఎల్ఈడి ఫ్లాష్‌లైట్స్..

ఈ డిజైనర్ చూపించిన దాని ప్రకారం మైక్రోసాఫ్ట్ Surface Phone వెనుక భాగంలో మూడు ప్రత్యేకమైన ఎల్ఈడి ఫ్లాష్‌లైట్‌లను ఏర్పాటు చేసారు.

మొబైల్స్ వేటలో చతికిల పడ్డ మైక్రోసాఫ్ట్

మొబైల్ ఆపరేటింగ్ సిస్టంల విభాగంలో ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్‌ల తమ తమ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ ఇంకా అనౌన్స్‌మెంట్స్‌తో ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ ఫోన్‌లు మార్కెట్ బ్లాక్‌బస్టర్‌లుగా నిలుస్తుండగా విండోస్ మొబైల్ ఫోన్‌లు మాత్రం ఇంకా నిలదొక్కుకునే ప్రయత్నంలోనే ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Microsoft Surface Phone Concept: The Upcoming Smartphone Should be a Stunner!. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot