మైక్రోసాఫ్ట్ నుంచి 3 సరికొత్త విండోస్ స్మార్ట్‌ఫోన్‌లు, త్వరలో!!

Posted By:

మైక్రోసాఫ్ట్ తన సరికొత్త లుమియా 535 స్మార్ట్‌ఫోన్‌‌ను మార్కెట్లో విడుదల చేసి మూడు రోజులు గడవక ముందే మరో 3 విండోస్ ఫోన్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మైక్రోసాఫ్ట్ నుంచి మరో 3 రాబోతున్నాయ్!!

AdDuplex ఓ ట్వీట్ ద్వారా విడుదల చేసిన సమచారం ప్రకారం మైక్రోసాఫ్ట్ తయారీదారుగా విడుదల చేయబోయే 3 విండోస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లు 4 నుంచి 5.7 అంగుళాల డిస్‌ప్లే సైజులను కలిగి ఉంటాయి.

ఈ ఊహాజనిత డివైస్‌లకు సంబంధించి ఏ విధమైన వివరాలను సదరు ట్వీట్‌లో పేర్కొనలేదు. అయితే, మైక్రోసాఫ్ట్ పలు విండోస్ ఫోన్ హ్యాండ్‌సెట్‌లను సామ్‌సంగ్ ఇంకా ఇతర ప్రధాన అంతర్జాతీయ బ్రాండ్‌లతో కలిసి మార్కెట్లోకి తెచ్చే అవకాశముందని తెలుస్తోంది.

4 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్‌లో మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టబోయే విండోస్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.4,000లోపు ఉండొచ్చని ఓ అంచనా. మార్కెట్లోని దేశవాళీ బ్రాండ్‌లతో ఈ మోడల్ తలపడే అవకాశముంది. 5.7 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్‌లో రూపుదిద్దుకునే విండోస్ ఫోన్ హ్యాండ్‌సెట్ యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ తరహాలో ఉన్నత స్థాయి స్పెసిఫికేషన్‌లతో అధిక ముగింపు ధరను కలిగి ఉండే అవకాశముందని తెలుస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Microsoft Tipped To Launch 3 New Windows Phone Smartphones. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting