విండోస్ ఫోన్, ఆండ్రాయిడ్‌ ఫోన్స్‌కి పోటీనిస్తుందా..?

Posted By: Super

విండోస్ ఫోన్, ఆండ్రాయిడ్‌ ఫోన్స్‌కి పోటీనిస్తుందా..?

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు పోటీగా మార్కెట్లో ఓ బ్రాండ్ వాల్యూని కొనసాగిస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాప్ట్ విండోస్. మైక్రోసాప్ట్ కొత్త ఆలోచనలకు పదునుపెట్టి కొత్త కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉంటుంది. మైక్రోసాప్ట్ కొత్తగా విడుదల చేయనున్న ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఫోన్ 7.5 మ్యాంగ్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ ఫోన్ 7.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రూపొందించిన కొత్త ఫోన్‌ను మైక్రోసాఫ్ట్ ఇండియా బుధవారం విడుదల చేసింది.

మైక్రోసాప్ట్ ఇప్పటికే 'విండోస్ మార్కెట్ ప్లేస్‌'ని విడుదల చేయడం జరిగింది. యూజర్స్ విండోస్ మార్కెట్ ప్లేస్‌ లోకి వెళ్లి కావాల్సిన అప్లికేషన్స్‌ని డౌన్ లోడ్ చేసుకొవచ్చు. మైక్రోసాప్ట్ విడుదల చేసిన విండోస్ ఫోన్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఎన్నో అంచనాలతో విడుదల చేస్తుంది. అందుకు కారణం ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఖచ్చితంగా యూజర్ ప్రెండ్లీ అవుతుందని వారి నమ్మకం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ విడుదల గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు.

ఈ మొబైల్ ఫోన్‌లో లైవ్ టూల్స్, హబ్స్‌తో కూడిన యూజర్ ఇంటర్‌ఫేస్ ఉండే ఈ విండోస్ ఫోన్ కావాల్సిన వారి నెంబర్‌ను వేగంగా వెదికేందుకు, కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుందని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ మొబైల్ ప్రాసెసర్‌తో కొత్త ఫోన్ పనిచేస్తుంది. నియామకాలు, వార్తలు, ఫ్రెండ్స్ స్టేటస్ వంటి రియల్ టైమ్ అప్‌డేట్స్ ఉండడం కొత్త లైవ్‌టైల్స్ విండోస్ ఫోన్ ప్రత్యేకత. హబ్‌ల ద్వారా ఒకే రకానికి చెందిన వివిధ అంశాల సమగ్ర సమాచారాన్ని పొందొచ్చు. పీపుల్, పిక్చర్స్, గేమ్స్, మ్యూజిక్ ప్లస్ వీడియో, మార్కెట్‌ప్లస్, ఆఫీస్ వంటి వాటికి సంబంధించిన ఒకే రకమైన కంటెంట్‌ను ఈ ఫోన్‌లో సులభంగా పొందొచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot