మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్ 8.1 (విశ్లేషణాత్మక వీడియో రివ్యూ)

Posted By:

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ వర్షన్‌ను ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. నోకియా లూమియా సీరిస్ నుంచి వస్తున్న అన్ని స్మార్ట్‌ఫోన్‌లు విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ వర్షన్ పై రన్ అవుతున్నాయి. విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం‌కు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా విడుదలైన విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం సరికొత్త ఫీచర్లను కలిగి ఉంది...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం

సౌకర్యవంతమైన స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లతో విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం యూజర్లను ఆకట్టుకుంటుంది.

విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం

విండోస్ ఫోన్ 8.1 మెరుగుపరచబడిన యాక్షన్ సెంటర్‌తో వేగవంతమైన పనతీరును అందిస్తోంది.

విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం

మెరుగుపరచబడిన క్యాలెండర్ ఇంకా స్మార్ కీబోర్డ్ వ్యవస్థతో విండోస్ ఫోన్ 8.1 ఆకట్టుకుంటోంది.

విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం

విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం వేగవంతమైన వెబ్ బ్రౌజింగ్ అనుభూతులను యూజర్లుకు చేరువ చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విడుదలైన విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం పనితీరుకు సంబంధించిన విశ్లేషణాత్మక రివ్యూను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/V-j47v9SBqU?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పన పై దృష్టిసారించిన దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ మొట్టమొదటి సారిగా విండోస్ ఫోన్‌లతో ముందుకొచ్చింది. విండోస్ ఫోన్ 8.1 మొబైల్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే రెండు సరికొత్త విండోస్ స్మార్ట్‌ఫోన్‌లను మైక్రోమాక్స్ విడదల చేసింది.

కాన్వాస్ విన్ డబ్ల్యూ121 ( Canvas Win W121), కాన్వాస్ విన్ డబ్ల్యూ092 (Canvas Win W092) వేరియంట్‌లలో ప్రదర్శించిన ఈ ఫోన్‌ల ధరలను రూ.9,500, రూ.6,500లుగా మైక్రోమాక్స్ ప్రకటించింది. ఈ రెండు ఫోన్‌లలో 1.2గిగాహెట్జ్ సామర్థ్యంతో కూడిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ల‌ను ఏర్పాటు చేసారు. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 1జీబి ర్యామ్‌లను కలిగి ఉంటాయి. డ్యూయల్ సిమ్ వాయిస్ కాలింగ్‌ను ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ విండోస్ ఫోన్‌లు సపోర్ట్ చేస్తాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot