ప్రమాదంలో Xiaomi ఫోన్‌లు?

|

చైనా యాపిల్‌గా పిలవబడుతోన్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు కంపెనీ చేసే వారి సంఖ్య కూడా మార్కెట్లో పెరుగుతూనే వస్తోంది. ఈ క్రమంలో ఓ షాకింగ్ న్యూస్ వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. Xiaomi ఫోన్‌లలో ఏర్పడ్డ ఓ సెక్యూరిటీ లోపాన్ని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు, ప్రమాదకర మాల్వేర్లను ఇన్‌ఫెక్ట్ చేసి ఫోన్‌లను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశముందని ఐబీఎమ్ సంస్ధకు చెందిన సెక్యూరిటీ రిసెర్చర్లు హెచ్చరించారు. మరిన్ని వివరాలు క్రింది స్లైడ్‌షోలో...

Read More : చైనా ఫోన్‌లకు సామ్‌సంగ్ షాక్, రూ.9,190కే కత్తిలాంటి ఫోన్

అనలిటిక్స్ ప్యాకేజీలో

అనలిటిక్స్ ప్యాకేజీలో

ఆండ్రాయిడ్ ఆధారంగా Xiaomiసంస్థ అభివృద్ది చేసుకున్న కస్టమ్ బిల్ట్ MIUI ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించిన అనలిటిక్స్ ప్యాకేజీలో ఓ సెక్యూరిటీ లోపం బహిర్గతమయ్యింది.

man-in-the-middle attack

man-in-the-middle attack

ఈ లోపాన్ని ఐబీఎమ్ సంస్థకు చెందిన సెక్యూరిటీ రిసెర్చర్లు గుర్తించారు. ఈ లూప్ హోల్‌ను ఆధారంగా చేసుకుని man-in-the-middle attack అనే పద్దతి ద్వారా హ్యాకర్లు ప్రమాదకరమైన మాల్వేర్లను మీ ఫోన్‌లలోకి జొప్పించే అవకాశముంది.

 

ఇన్‌స్టాల్ చేసుకునే యాప్ లేదా గేమ్ ప్యాకేజీ ద్వారా

ఇన్‌స్టాల్ చేసుకునే యాప్ లేదా గేమ్ ప్యాకేజీ ద్వారా

దీని గురించి క్లియర్ కట్‌గా మాట్లాడుకోవాలంటే Xiaomi యూజర్లు ఇంటర్నెట్ నుంచి తమ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకునే యాప్ లేదా గేమ్ ప్యాకేజీ ద్వారా మాల్వేర్లను హ్యాకర్లు ఇంజెక్ట్ చేస్తారు.

 

మీ ప్రమేయం లేకుండా మీ డివైస్‌లోకి...
 

మీ ప్రమేయం లేకుండా మీ డివైస్‌లోకి...

ఆయా యాప్ లేదా గేమ్ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయ్యే క్రమంలో ఆటోమెటిక్‌గా ఈ మాల్వేర్ మీ ప్రమేయం లేకుండా మీ డివైస్‌లో ఎగ్జిక్యూట్ కాబడుతుంది. దీంతో మీ ఫోన్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది.

 అప్రమత్తమైన షియోమీ వెనువెంటనే..

అప్రమత్తమైన షియోమీ వెనువెంటనే..

ఈ సెక్యూరిటీ లోపం పై అప్రమత్తమైన షియోమీ వెనువెంటనే సెక్యూరిటీ అప్‌డేట్‌ను లాంచ్ చేసింది. ఈ అప్‌డేట్‌ను పొందటం ద్వారా సెక్యూరిటీ లోపాన్ని పూర్తిగా అధిగమించవచ్చని కంపెనీ వెల్లడించింది.

 

 చాలా మందికి తెలియదు...

చాలా మందికి తెలియదు...

అయితే చాలా మంది షియోమీ యూజర్లు ఇప్పటికి ఈ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోలేదు. వీరి ఫోన్‌లు ఇంకా ప్రమాదంలో ఉన్నట్లే.

వెంటనే మీ Xiaomi ఫోన్‌లను అప్‌డేట్ చేసుకోండి

వెంటనే మీ Xiaomi ఫోన్‌లను అప్‌డేట్ చేసుకోండి

కాబట్టి, షియోమీ యూజర్లు వెంటనే తమ ఫోన్‌లను అప్‌డేట్ చేసుకోవల్సి ఉంది. ప్రపంచపు మూడవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీగా షియోమీ కొనసాగుతోంది.

Best Mobiles in India

English summary
Millions of Xiaomi phones at risk of remotely installed malware. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X