మరో అద్భుతం, పగలని ఫోన్ డిస్‌ప్లేలు వచ్చేస్తున్నాయ్

ఫోన్ క్రింద పడితే ముందుగా పగిలేది డిస్‌ప్లే. ఇక పై అలాంటి సమస్యలు ఉండకపొవచ్చు. పటిష్టమైన ఫోన్ డిస్‌ప్లేలను అభివృద్ధి చేసేందుకుగాను శాస్ర్తవేత్తలు గొత్త కొద్ది సంవత్సరాలుగా శ్రమిస్తూనే ఉన్నారు. తాజాగా వారి పరిశొధనలకు ఫలితం దక్కినట్లయింది. క్వీన్స్ యూనివర్శటీకి స్కూల్‌కు చెందిన డాక్టర్ ఎల్టన్ సాన్టోస్ మరికొంత మంది పరిశోధకలుతో కలిసి శక్తివంతమైన మిరాకిల్ మెటరీయల్ కనుగొన్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మిరాకిల్ మెటీరియల్

సీ60 అనే కార్బన్ మూలకాన్ని గ్రాఫెన్, hBN వంటి పదార్థాలతో సెమీ కండెక్టింగ్ చేయటం ద్వారా ఓ విభిన్నమైన మెటీరియల్ ఆవిర్భవించింది. ఈ కొత్త మెటీరియల్ టెక్నాలజీ, స్మార్ట్ డివైసెస్ విభాగంలో విప్లవాత్మక మార్పులను తీసుకురాబోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

విప్లవాత్మక మార్పులు

ఈ మిరాకిల్ మెటీరియల్‌తో రూపుదిద్దుకునే స్క్రీన్‌‌లు మరింత స్థిరత్వాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ విన్నింగ్ కాంభినేషన్‌లో ఉపయోగించిన hBN పదార్థం స్థిరత్వాన్ని ఇవ్వటంతో పాటు విద్యుత్‌‌ను వేగంగా కండెక్ట్ చేయగలుగుతుంది. సీ60 మూలకం సన్‌లైట్‌ను ఎలక్ట్రసిటీగా మార్చగలుగుతుంది.

సిలికాన్ ఇంకా ఇతర మెటీరియల్స్‌తో.

ప్రస్తుతం మన వాడుతోన్న ఫోన్‌లకు సంబంధించిన స్క్రీన్‌లను సిలికాన్ ఇంకా ఇతర మెటీరియల్స్‌తో తయారుచేస్తున్నారు. ఇవి ఖరీదైనవిగా ఉండటంతో పాటు త్వరగా బ్రేక్ అయిపోతున్నాయి.

అన్‌బ్రేకబుల్ డిస్‌ప్లే ఫోన్‌లు సాధ్యమే...

తాజాగా కొనుగొన్న మిరాకిల్ మెటీరియల్‌తో ఈ సమస్య ఉండదు. తక్కువ ఖరీదులోనే మన్నికైన ఫోన్ డిస్‌ప్లేలు వచ్చేస్తాయి. స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు తర్వగా ఈ స్క్రీన్‌ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నట్లయితే అన్‌బ్రేకబుల్ డిస్‌ప్లే ఫోన్‌లను మనం వాడగలుగుతాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
'Miracle material' discovery could end cracked smart devices. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot