Just In
- 6 hrs ago రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- 7 hrs ago Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- 7 hrs ago ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- 8 hrs ago ఎయిర్ కండిషనర్ (AC) ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
Don't Miss
- News సీఎం జగన్‌పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మీ ఫోన్ సెక్యూరిటీ బాగుండాలా..? అయితే ఈ 10 తప్పులు చేయకండి!
సెక్యూరిటీ వ్యవస్థ బలహీనంగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలోకి హ్యాకర్లు సునాయాశంగా మాల్వేర్లను జొప్పించి డేటాను నాశనం చేయగలుగుతున్నారు. కొన్ని కొన్నిసందర్భాల్లో అవనగాహన లేమితో మనం చేసే చిన్నితప్పిదమే మన ఫోన్‌ను ఇరకాటంలో పడేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లను సెక్యూరిటీ చిక్కుల్లోకి నెట్టేసే 10 సాధారణ తప్పిదాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Read More : సిమ్ కార్డ్ ఎలా క్లోన్ చేస్తారు..?
లాక్ చేయటం మరవకండి...
స్మార్ట్‌ఫోన్‌ను లాక్ చేయకపోవటం కూడా సెక్యూరిటీ తప్పిదమేనంటున్నారు సెక్యూరిటీ నిపుణులు. మీ ఫోన్‌కు లాక్ ఏర్పాటు చేయని పక్షంలో ఎవరు పడితే వాళ్లు మీ ఫోన్‌ను యాక్సెస్ చేసుకునే ప్రమాదముంది.
పబ్లిక్ వై-ఫైల జోలికి పోకండి
పబ్లిక్ వై-ఫైలు వద్ద ఇంటర్నెట్‌ను ఉచితంగా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికి సెక్యూరిటీ రిస్క్‌లు చాలానే ఉంటాయి. ఇలాంటి చోటే మీ ఫోన్‌ను మాల్వేర్లు చుట్టిముట్టే ప్రమాదముంది. కాబట్టి పబ్లిక్ వై-ఫైల వద్ద ఇంటర్నెట్‌ను ఉపయోగించుకునే ముందు ఆచితూచి స్పందించండి.
ఇంటర్నెట్‌లో జాగ్రత్తగా వ్యవహరించండి
ఇంటర్నెట్‌లో కనిపించే ప్రతీ లింక్ పై క్లిక్ చేయటం కూడా సెక్యూరిటీ తప్పిదం లాంటిదేనని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యే కొన్ని లింక్స్ ప్రమాదకర మాల్వేర్లను కలిగి ఉంటాయి. వీటిని క్లిక్ చేయటం ద్వారా మాల్వేర్ మీ ఫోన్ లోని డేటాను నాశనం చేసేస్తుంది.
యాప్స్‌తో జాగ్రత్త
మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్నట్లయితే అప్లికేషన్‌లను గూగుల్ ప్లే స్టోన్ నుంచి పొందండి. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేముందు వెరిఫికేషన్ అనేది చాలా అవసరం.
రూట్ చేయకండి.. కంపెనీ అప్‌డేట్స్ ఉండవు
ఆండ్రాయిడ్ ఫోన్‌ను రూట్ చేయటం కూడా సెక్యూరిటీ తప్పిదం లాంటిదేనని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయటం వల్ల మీ ఫోన్ మాల్వేర్లకు మరింతగా అట్రాక్ట్ అయ్యే అవకాశముంది.
క్రమం తప్పకుండా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను పొందండి
ఫోన్ పనితీరును మెరుగుపరించేందుకు స్మార్ట్‌ఫోన్ తయారీదారులతో పాటు అప్లికేషన్ డెవలపర్లు ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందుబాటులోకి తీసుకువస్తుంటారు. వీటిని ఎప్పటికప్పుడు ఫాలో అవటం వల్ల ఫోన్ సెక్యూరిటీ రిస్క్‌ను దాదాపుగా తగ్గించుకోవచ్చు. కొంత మంది ఈ అప్‌డేట్‌లను ఏ మాత్రం లెక్క్ చేయరు
యాంటీ వైరస్ తప్పనిసరి
చాలామంది తమ స్మార్‌ఫోన్‌లలో యాంటీ వైరస్‌ను ఇన్స్‌స్టాల్ చేయరు. వాళ్ల ఫోన్ రిస్క్‌లో ఉందనటానికి ఇదే తొలి సంకేతం. యాంటీవైరస్ సపోర్ట్‌లేని ఫోన్‌లను ఏ నిమిషంలోనైనా మాల్వేర్లు చుట్టుముట్టే ప్రమాదముంది.
కనెక్టువిటీ ఫీచర్లు టర్నాఫ్ చేయండి
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి వైర్‌లెస్ కనెక్షన్‌లను ఎప్పుడు ఆన్ చేసి ఉంచటం వల్ల కూడా సెక్యూరిటీ సమస్యలు తలెత్తే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు.
ఆన్‌లైన్ అకౌంట్‌లను లాగ్ అవుట్ చేయండి
జీమెయిల్, ఫేస్‌బుక్ వంటి ఆన్‌లైన్ అకౌంట్‌లను లాగ్ అవుట్ చేయకుండా మర్చిపోవటం కూడా సెక్యూరిటీ సమస్యలు తలెత్తే ప్రమాదముందని సెక్యూరిటీ నిపుణులు అంటున్నారు.
వ్యక్తిగత డేటాను ఫోన్‌లో ఉంచకండి
అత్యంత ముఖ్యమైన వ్యక్తిగత డేటాను మొబైల్ ఫోన్‌లో స్టోర్ చేయటం ఏ మాత్రం మంచిది కాదని సెక్యూరిటీ నిపుణులు అంటున్నారు. కొంత మంది ఇవేమి పట్టించుకోకుండా తమ బ్యాంక్ అకౌంట్ నెంబర్లతో పాటు పిన్ కోడ్‌లను ఫోన్‌లలోనే ఫీడ్ చేస్తుంటారు. పొరపాటున ఇలాంటి వారి ఫోన్ హ్యాక్‌కు గురైతే బోలెండత నష్టం వాటిల్లుతుంది.
అనుకోకుండా ఫోన్ మిస్ అయితే..?
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసి ఉంచటం ద్వారా ఫోన్ మిస్ అయిన సమయంలో గూగుల్ మాప్స్ సాయంతో ఫోన్ ట్రాక్ చేయబడుతుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470