త్వరలో మార్కెట్లోకి 'మితాషి' ఐదు మొబైల్స్..

Posted By: Prashanth

త్వరలో మార్కెట్లోకి 'మితాషి' ఐదు మొబైల్స్..

 

ఎలక్ట్రానిక్స్ రంగంలో త్వరలో విడుదల కానున్న బ్రాండ్ 'మితాషి'. మార్కెట్లోకి మితాషి హోం స్పీకర్స్ నుండి డివిడి, ఎల్‌సిడి ప్లేయర్స్ మాత్రమే కాకుండా, ఎల్‌ఈడి ప్లేయర్స్‌ను కూడా విడుదల చేస్తూ ఉంటుంది. ఒక రంగంలో నిష్ణాతులైన తర్వాత పలు రంగాలలోకి ప్రవేశించాలని పలు కంపెనీలు ఆకాంక్షిస్తూ ఉంటాయి. ఇందులో భాగంగానే మితాషి కూడా త్వరలో మొబైల్ రంగంలోకి అడుగు పెట్టనుంది.

మితాషి త్వరలో ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి విడుదల చేయనున్న మొబైల్ ఫోన్స్ పేర్లు ఎమ్ఐటి 01, ఎమ్ఐటి 02, ఎమ్ఐటి 03, ఎమ్ఐటి 04, ఎమ్ఐటి 05. మొదటి సారి మార్కెట్లోకి ప్రవేశించడంతో తక్కవ ధరలో ఎక్కవ మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేసి, ప్రజల మన్ననలను పొందేందుకు గాను ప్రణాళికలను సిద్దం చేస్తుంది.

మితాషి ఎమ్ఐటి 01, ఎమ్ఐటి 02 రెండు మొబైల్ ఫోన్స్ కూడా బేసిక్ మోడల్ ఫోన్స్. డిస్ ప్లే సైజు 4.6cm. ఇందులో ఉన్న మొబైల్ కెమెరాతో చక్కని ఫోటోలను తీయవచ్చు. మొబైల్‌తో పాటు కొంత మెమరీ లభిస్తుండగా, మెమరీని 2జిబి వరకు విస్తరించుకొవచ్చు. మొబైల్‌లో ఉన్న ఫోన్‌బుక్ లో సుమారు 500 ఫోన్ నెంబర్స్‌ని సేవ్ చేసుకొవచ్చు. MP3, MPEG4 ఫైల్స్‌ని సపోర్ట్ చేసేటటువంటి ఆడియో, వీడియో ప్లేయర్స్ వీటి సొంతం. ఎఫ్‌ఎమ్ రేడియో ప్రత్యేకం. కనెక్టివిటీ ఫీచర్స్ కొసం ఇందులో బ్లూటూత్, జిపిఆర్‌స్ ఫీచర్స్‌ని కూడా ప్రవేశెపట్టడం జరిగింది.

మితాషి ఎమ్ఐటి 03, ఎమ్ఐటి 04 విషయానికి వస్తే డిస్ ప్లే సైజు 5.6cm. 1.3 మెగా ఫిక్సల్ కెమెరా వీటి సొంతం. మెమెరీని విస్తరించుకునేందుకు గాను 4జిబి మెమరీ అందుబాటులో ఉంటుంది. ఈ రెండు మొబైల్స్‌లలో ఉన్న గొప్ప ఫీచర్ ఏమిటంటే డ్యూయల్ స్పీకర్స్‌తో పాటు యాంప్లిపైర్‌ని కలిగి ఉండడమే. ఇందులో ఉన్న ఆడియో, వీడియో ప్లేయర్స్ MP3, MPEG4 ఫార్మెట్లను సపొర్ట్ చేస్తాయి. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో 1300 mAh lithium ion బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది.

మితాషి ఎమ్ఐటి 05 మొబైల్ డిస్ ప్లే సైజు 5.9cm. క్వర్టీ కీప్యాడ్ దీని సొంతం. సోషల్ నెట్ వర్కింగ్ ఫీచర్స్ అయిన ఫేస్‌బుక్, ట్విట్టర్‌ని యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఈ మొబైల్‌లో కల్పించడం జరిగింది. ఇండియన్ మొబైల్ మార్కెట్లో ప్రస్తుతానికి అందుబాటులో లేకపోయినప్పటికీ త్వరలో మార్క్టెట్లో విడుదల కానున్నాయి. అందుకే వీటి ధరలను ఇంకా ప్రకటించ లేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot