రూ.4,999కే 4జీ వోల్ట్ స్మార్ట్‌ఫోన్,2జిబి ర్యామ్ 13MP రియర్, 8ఎంపీ సెల్ఫీ కెమెరాతో
మన స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ముంచేత్తేందుకు మరో స్మార్ట్‌ఫోన్ బ్రాండు వచ్చేసింది.
మన స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ముంచేత్తేందుకు మరో స్మార్ట్‌ఫోన్ బ్రాండు వచ్చేసింది. ఇప్పటికే చైనా కంపెనీల ఫోన్లు భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో హోరెత్తిస్తుండగా.. తాజాగా వియత్నాంకు చెందిన మొబిస్టార్ కూడా దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. భారత్‌లో అత్యంత తక్కువ ధరలో రెండు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. మొబిస్టార్ సీక్యూ, మొబిస్టార్ ఎక్స్‌క్యూ పేరిట విడుదలైన ఈ ఫోన్లు ప్‌కార్ట్ సైట్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.

మొబిస్టార్ సీక్యూ..
మొబిస్టార్ సీక్యూ రూ.4,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యేకంగా లభిస్తున్నది. ఈ నెల 30వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. రిలయన్స్ జియో కస్టమర్లకు ఈ ఫోన్‌పై రూ.1000 డిస్కౌంట్‌తోపాటు రూ.99కే మొబైల్ ప్రొటెక్షన్, రూ.2200 క్యాష్‌బ్యాక్ లభిస్తున్నాయి.

మొబిస్టార్ సీక్యూ ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

మొబిస్టార్ ఎక్స్‌క్యూ
మొబిస్టార్ ఎక్స్‌క్యూ డ్యూయల్ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ ముందు వైపు డ్యూయల్ కెమెరా. 13 మెగాపిక్సెల్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ సెన్సార్లను ఆ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంది. సెల్ఫీలకు ఇది 120 డిగ్రీల వైండ్ యాంగిల్‌ను కూడా సపోర్టు చేస్తోంది. షియోమి రెడ్‌మి వై1, ఒప్పో రియల్‌మి 1, హానర్ 7సీ స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీగా మొబిస్టార్ ఎక్స్‌క్యూ డ్యూయల్ భారత మార్కెట్‌లోకి వచ్చింది.

రూ.7,999 ధరకు
రూ.7,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ప్రత్యేకంగా లభిస్తున్నది. ఈ ఫోన్‌పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తున్నారు. దీంతోపాటు రూ.99 కే మొబైల్ ప్రొటెక్షన్ కూడా లభిస్తున్నది. ఈ ఫోన్‌పై జియో రూ.2200 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది.

మొబిస్టార్ ఎక్స్‌క్యూ డ్యుయల్ ఫీచర్లు
5.5 ఇంచ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 13, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








