Home
Mobile

షియోమి,ఒప్పో,హువాయిలకు భారీ షాక్, బడ్జెట్ ధరకే డ్యూయెల్ సెల్ఫీ 4జీ స్మార్ట్‌ఫోన్‌

చైనా కంపెనీలను ఢీ కొట్టేందుకు ఇండియా మార్కెట్లోకి మరో స్మార్ట్‌ఫోన్ దూసుకొచ్చింది.

By Hazarath Aiah

చైనా కంపెనీలను ఢీ కొట్టేందుకు ఇండియా మార్కెట్లోకి మరో స్మార్ట్‌ఫోన్ దూసుకొచ్చింది. ఇప్పటికే చైనా కంపెనీల ఫోన్లు భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో దూసుకుపోతుండగా వీటిని సవాల్ చేస్తూ వియత్నాంకు చెందిన మొబిస్టార్‌ కూడా దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి ప్రవేశించింది.భారత్‌లో తన తొలి స్మార్ట్‌ఫోన్‌ మొబిస్టార్‌ ఎక్స్‌క్యూ డ్యూయల్‌ను లాంచ్‌ చేసింది. దీని ధర 7,999 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. మే 30 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఏడాది వారెంటీని కంపెనీ ఆఫర్‌ చేస్తోంది. ఫీచర్ల వివరాలను ఓ సారి పరిశీలిస్తే..

డ్యూయల్‌ కెమెరా..

డ్యూయల్‌ కెమెరా..

మొబిస్టార్‌ ఎక్స్‌క్యూ డ్యూయల్‌ స్మార్ట్‌ఫోన్‌ ప్రధాన ఆకర్షణ ముందు వైపు డ్యూయల్‌ కెమెరాను కలిగి ఉండటం. 13 మెగాపిక్సెల్‌ సెన్సార్‌, 5 మెగాపిక్సెల్‌ సెన్సార్లను ఆ స్మార్ట్‌ఫోన్‌ కలిగి ఉంది. సెల్ఫీలకు ఇది 120 డిగ్రీల వైండ్‌ యాంగిల్‌ను కూడా సపోర్టు చేస్తోంది.

స్పెషిఫికేషన్ల విషయానికొస్తే..

స్పెషిఫికేషన్ల విషయానికొస్తే..

షియోమి రెడ్‌మి వై1, ఒప్పో రియల్‌మి 1, హానర్‌ 7సీ స్మార్ట్‌ఫోన్లకు మొబిస్టార్‌ ఎక్స్‌క్యూ డ్యూయల్‌ గట్టి పోటీగా మారనుంది. మొబిస్టార్‌ ఎక్స్‌క్యూ డ్యూయల్‌ స్పెషిఫికేషన్ల విషయానికొస్తే..
5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 425 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 7.1.2, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, మైక్రో ఎస్ డి ద్వారా విస్తరణ సామర్ధ్యం, వెనుక వైపు 13 మెగాపిక్సెల్‌ సెన్సార్‌, 13 మెగాపిక్సెల్‌ సెన్సార్‌, 5 మెగాపిక్సెల్‌ సెన్సార్ల డ్యూయెల్ సెల్పీ కెమెరా, గ్రాఫిక్స్‌ కోసం అడ్రినో 505, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, డ్యూయల్‌ సిమ్‌, 160 గ్రాముల బరువు, 4G, 3G, Wi-Fi, and Bluetooth 4.1

Redmi Y1

Redmi Y1

దీనికి పోటీగా ఉన్న Redmi Y1 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.8,999. Redmi Y1 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.10,999. Redmi Y1 Lite ధర రూ.6,999.
Redmi Y1 ప్రత్యేకతలు.. మెటల్ యునిబాడీ డిజైన్, 5.5 అంగుళాల ఐపీఎస్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఆపరేటింగ్ సిస్టం, MIUI 8 కస్టమైజిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.4Ghz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 435 ఆక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి,64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3080mAh బ్యాటరీ.

 

 

రియ‌ల్‌మి1

రియ‌ల్‌మి1

మూడు వేరియంట్లలో విడుదలైన ఒప్పో రియల్ మి 1 ధరలు పరిశీలిస్తే.. 3జీబీర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 8,990, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ ధర రూ.10990, 6జీబీ, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ.13990గా ఉండనున్నాయి.
రియ‌ల్‌మి1 ఫీచ‌ర్లు 6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి60 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్‌, 32/64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3410 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

హానర్ 7సి

హానర్ 7సి

హానర్ 7సి' 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్ల ఫోన్ రూ.9,999, రూ.11,999 ధరలకు వినియోగదారులకు లభిస్తున్నది.
హానర్ 7సి ఫీచర్లు
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Mobiistar XQ Dual with two front cameras launched: Price, full specifications, features More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X