ఇంటర్నెట్‌ లేకుండా మొబైల్ బ్యాంకింగ్ సాధ్యమే, అది ఎలాగో తెలుసుకోండి

ఇంటర్నెట్ అందుబాటులోలేని సాధారణ మొబైల్‌ఫోన్ యూజర్లకు USSD ఆధారిత మొబైల్ బ్యాంకింగ్ సర్వీసును ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది.

|

చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు డిజిటల్ వాలెట్స్ ద్వారా డబ్బులు చెల్లిస్తూ, రోజువారి అవసరాలను తీర్చకుంటున్న వైనాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ UPI ఆధారిత యాప్స్ స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే పరిమితమవటంతో ఫీచర్ ఫోన్‌లను వినియోగించుకునే వారు క్యాష్‌లెస్ చెల్లింపుల వైపు త్వరితగతిన అడుగులు వేయలేకపోతున్నారు.

 

వాట్సాప్‌లో coloured Text status సదుపాయంవాట్సాప్‌లో coloured Text status సదుపాయం

USSD మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్..

USSD మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్..

ఇంటర్నెట్ అందుబాటులోలేని సాధారణ మొబైల్‌ఫోన్ యూజర్లకు USSD ఆధారిత మొబైల్ బ్యాంకింగ్ సర్వీసును ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్లాక్ అండ్ వైట్ డిస్‌ప్లేతో పనిచేసే బేసిక్ ఫోన్‌లు మొదలుకుని టాప్ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల వరకు ఈ USSD మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులను సపోర్ట్ చేస్తాయి.

నేషనల్ యునిఫైడ్ యూఎస్ఎస్‌డి ప్లాట్‌ఫామ్‌

నేషనల్ యునిఫైడ్ యూఎస్ఎస్‌డి ప్లాట్‌ఫామ్‌

నేషనల్ యునిఫైడ్ యూఎస్ఎస్‌డి ప్లాట్‌ఫామ్‌చే అభివృద్థిచేయబడిన ఈ ఇంటర్‌ఫేస్, మిమ్మల్ని మీ టెలికం ఆపరేటర్ ద్వారా మీ బ్యాంకర్‌కు కనెక్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. USSD మొబైల్ బ్యాంకింగ్ సేవలు 11 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉన్నాయి.

ఎంటర్ చేయవల్సిన షార్ట్ కోడ్స్‌
 

ఎంటర్ చేయవల్సిన షార్ట్ కోడ్స్‌

మీకు నచ్చిన భాషను ఎంపిక చేసుకునేందుకు మీ ఫోన్ కీప్యాడ్‌లో ఎంటర్ చేయవల్సిన షార్ట్ కోడ్స్‌.. తెలుగు కోసం (*99*24#), తమిళం కోసం (*99*23#), హిందీ కోసం (*99*22#), మరాఠీ కోసం (*99*28#), బెంగాలీ కోసం (*99*29#), పంజాబీ కోసం (*99*30#), కన్నడ కోసం (*99*26#), గుజరాతీ కోసం (*99*27#), మళయాళం కోసం (*99*25#), ఒరియా కోసం (*99*32#), అస్సామీస్ కోసం (*99*31#)

రూ.1 నుంచి రూ.5,000 వరకు..

రూ.1 నుంచి రూ.5,000 వరకు..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం, USSD చెల్లింపు విధానం ద్వారా ఒక్కో transactionకు రూ.1 నుంచి రూ.5,000 వరకు నగదును ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఒక్కో లావాదేవీకి రూ.50 పైసలు ఛార్జ్ చేయబడుతుంది. ఈ మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ 24/7 అందుబాటులో ఉంటుంది.

మొబైల్ మనీ ఐడెంటీఫైర్ నెంబర్ తప్పనిసరి..

మొబైల్ మనీ ఐడెంటీఫైర్ నెంబర్ తప్పనిసరి..

USSD మొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందే క్రమంలో, మీ మొబైల్ నెంబర్ తప్పనిసరిగా మొబైల్ బ్యాంకింగ్‌తో రిజిస్టర్ అయి ఉండాలి. ఒకవేళ మీ ఫోన్ నెంబర్, మొబైల్ బ్యాంకింగ్‌తో రిజిస్టర్ కాని పక్షంలో వెంటనే మీ బ్యాంకుకు వెళ్లి ఫారమ్‌ను ఫిల్ చేసి బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేయవల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ విజయవంతమైన వెంటనే మీకో మొబైల్ మనీ ఐడెంటీఫైర్ (MMID) నెంబర్ అందుతుంది. ఈ 7 అంకెల నెంబరును బ్యాంక్ వారు ఇష్యూ చేయటం జరుగుతుంది. ఈ నెంబర్ ద్వారానే మొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందగలుగుతారు.

MPIN నెంబర్ కూడా ఇష్యూ చేస్తారు..

MPIN నెంబర్ కూడా ఇష్యూ చేస్తారు..

USSD మొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందే క్రమంలో ఈ MMID నెంబర్ కీలకంగా వ్యవహరిస్తుంది. ఇదే సమయంలో 4 డిజట్లతో కూడిన MPINను కూడా మీకు బ్యాంక్ వారు అందించటం జరుగుతుంది. దీనికి పాస్‌వర్డ్‌గా ఉపయోగించుకోవల్సి ఉంటుంది. డీఫాల్ట్ MPINను పొందిన వెంటనే నచ్చిన అంకెలతో పిన్‌ను మార్చుకోవచ్చు.

వెల్‌కమ్ స్ర్కీన్‌లో మూడు అక్షరాలతో..

వెల్‌కమ్ స్ర్కీన్‌లో మూడు అక్షరాలతో..

ఇప్పుడు ఓపెన్ అయ్యే వెల్‌కమ్ స్ర్కీన్‌లో మూడు అక్షరాలతో కూడిన బ్యాంక్ షార్ట్ నేమ్ కాని, ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌కు సంబంధించి మొదటి నాలుగు అక్షరాలు గాని, రెండు డిజిట్ల బ్యాంక్ న్యూమరిక్ కోడ్‌ను గాని ఎంటర్ చేసి సెండ్ బటన్ పై క్లిక్ చేయండి.

మీకు స్టేట్ బ్యాంక్ ఇండియాలో మీకు అకౌంట్ ఉన్నట్లయితే

మీకు స్టేట్ బ్యాంక్ ఇండియాలో మీకు అకౌంట్ ఉన్నట్లయితే

మీకు స్టేట్ బ్యాంక్ ఇండియాలో మీకు అకౌంట్ ఉన్నట్లయితే SBI అనే టైప్ చేస్తే సరిపోతుంది. ఐఎఫ్ఎస్‌సీ కోడ్ క్రింద SBIN అని టైప్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ అలానే బ్యాంక్ అకౌంట్ వివరాలు వెరిఫై కాబడి ఓ ప్రత్యేకమైన సబ్ మెనూ ఓపెన్ అవుతుంది.

అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసుకోవటం, మినీ స్టేట్‌మెంట్‌ను చెక్ చేసుకోవటం,

అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసుకోవటం, మినీ స్టేట్‌మెంట్‌ను చెక్ చేసుకోవటం,

ఈ మెనూలో అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసుకోవటం, మినీ స్టేట్‌మెంట్‌ను చెక్ చేసుకోవటం, మనీ ట్రాన్స్‌ఫర్ వంటి ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసుకునేందుకు 1 అంకెను, మినీ స్టేట్‌మెంట్‌ను పొందేందుకు 2 అంకెను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. నగదును పంపుకునేందుకు MMID కోడ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Mobile Banking Without Internet. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X